Begin typing your search above and press return to search.
నాని గీతను మిస్సయ్యాడా?
By: Tupaki Desk | 19 Aug 2018 7:37 AM GMTకొన్నిసార్లు హీరోల ఇన్ పుట్స్ సినిమాల విజయాలకు కలిసొస్తుంటాయి. అలా అప్పట్లో డార్లింగ్ - మిర్చి సినిమాలకు డార్లింగ్ ప్రభాస్ ఇచ్చిన ఇన్ పుట్స్ పెద్ద రేంజులో వర్కవుటయ్యాయని దర్శకులే ప్రకటించి అతడిని వేదికలపై మెచ్చుకున్నారు. డార్లింగ్‌లోని ఇంటెలిజెన్స్ ని రెబల్ స్టార్ కృష్ణం రాజు పలు వేదికలపై కొనియాడారు. నా బిడ్డడు ఎంతో ఎదిగాడని - అతడి సలహాలు సినిమాల్లో వర్కవుటవ్వడం తనకు గర్వాన్ని ఇస్తోందని పొగిడేశారు.
ఇప్పుడు సేమ్ టు సేమ్ విజయ్ దేవరకొండకు పొగడ్తలు దక్కుతున్నాయి. అతడు కూడా డార్లింగ్ తర్వాత డార్లింగ్ అంతటివాడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. దేవరకొండ పక్కా జెంటిల్ మేన్ అంటూ ఇదివరకూ అల్లు అరవింద్ కితాబిచ్చారు. అంతేకాదు దర్శకుడు పరశురామ్ సైతం అతడిని ఇంటర్వ్యూల్లో పొగిడేశారు. గీత గోవిందం క్రియేటివ్ పార్ట్ లోనూ దేవరకొండ ఓ చిరు సాయం చేశాడట. అతడు ఇచ్చిన క్రియేటివ్ ఇన్ పుట్స్ పెద్ద రేంజులో వర్కవుటయ్యాయనేది యూనిట్ చెబుతున్న మాట.
గీతగోవిందంలో ఓ చిన్న కామియో కోసం నేచురల్ స్టార్ నాని లేదా శర్వానంద్ ని సంప్రదించాలని మేకర్స్ భావించారు. కానీ ఆ ప్లేస్‌లో నిత్యామీనన్ కామియో అయితే బావుంటుందని దేవరకొండ ఇచ్చిన సలహా పెద్ద రేంజులో వర్కవుటైందని మేకర్స్ భావిస్తున్నారట. నాని - శర్వా అలా గీతగోవిందంలో కామియో మిస్సయ్యారు. మొత్తానికి నటించేవాడికి కొన్ని తెలియాలి అన్నది ఈ వ్యవహారం చెబుతోంది. క్రియేటర్స్ వరల్డ్ లో ప్రతి ఒక్కరూ క్రియేటర్ కాకపోయినా హీరోలు దర్శకనిర్మాతలకు సహకరించే ప్రాసెస్ లో అది తప్పనిసరి. యాక్టర్ విత్ బ్రెయిన్ అని ఊరికే అంటారా? ఇందరు హీరోల మధ్య దేవరకొండ వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టేస్తున్నాడంటే ఆ మాత్రం మైండ్ .. మైండ్ సెట్ ఉంది కాబట్టే!