Begin typing your search above and press return to search.
రేంజ్ కాదు.. రిలేషన్ ముఖ్యం
By: Tupaki Desk | 22 Feb 2016 9:30 AM GMTనాని ఇప్పుడు వరుస సక్సెస్ లతో ఫుల్లు జోష్ లో ఉన్నాడు. ఎవడే సుబ్రమణ్యం - భలే భలే మగాడివోయ్ - కృష్ణగాడి వీర ప్రేమగాధ విజయాలతో హ్యాట్రిక్ కూడా కొట్టేశాడు. మరి ఇలాంటి సమయంలో నాని నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఎన్నో ఆశలు, అంచనాలు ఉంటాయి. మరి ఈ టైంలో ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయడాన్ని రిస్క్ అని పక్కకు జరుగుతారు ఏ హీరో అయినా. కానీ నాని మాత్రం ఇంద్రగంటి మోహనకృష్ణతో ధమాకాను చేసేస్తున్నాడు.
గ్రహణం - అష్టాచెమ్మా - మాయాబజార్ - అంతకు ముందు ఆ తరువాత వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు పొందడమే కాదు.. జాతీయ అవార్డును కూడా సాధించాడు ఇంద్రగంటి. రీసెంట్ గా ఈయన తీసిన బందిపోటు బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. కమర్షియల్ గా సక్సెస్ చూసి కూడా చాలా కాలమే అయింది ఈయనకు. మరి ఈ సమయంలో నానిని ఓ సినిమా చేయమని అడగడం, ఓకే చేయడమే కాదు.. ఇప్పటికే షూటింగ్ కూడా జరిగిపోతోంది.
ఇక్కడ ఫ్లాప్ డైరెక్టర్ అని భావించేకంటే.. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తిగానే ఇంద్రగంటికి విలువ ఇచ్చాడు నాని. అందుకే ఫ్లాపుల్లో ఉన్న విషయం తెలిసినా సరే, పట్టించుకోకుండా సినిమా చేస్తున్నాడు. ఇలా తనను హీరో చేసిన డైరెక్టర్ ను నమ్మి, కృతజ్ఞతగా సినిమా చేస్తున్న నేచురల్ స్టార్ ని అభినందించాల్సిందే కదూ.