Begin typing your search above and press return to search.
జూనియర్ కి సింపతీ వర్కవుట్ అయిందట
By: Tupaki Desk | 7 Feb 2016 7:30 AM GMTజూనియర్ ఎన్టీఆర్ మూవీ నాన్నకు ప్రేమతో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కి రాలేకపోయినా.. ఓవరాల్ గా మాత్రం సూపర్ సక్సెస్ సాధించింది. దీనికి మూవీలో ఉన్న కంటెంట్ - ఎన్టీఆర్ ట్యాలెంట్ - సుకుమార్ సత్తాతో పాటు.. మరో ఫ్యాక్టర్ కూడా బాగా వర్కవుట్ అయిందని అంటున్నారు.
అదే సింపతీ.. అవును యంగ్ టైగర్ పై సింపతీనే నాన్నకు ప్రేమతో ఇంతగా హిట్ సాధించడానికి కారణమనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ పై జాలి పడాల్సిన పరిస్థితి ఏంటనే ప్రశ్న వస్తుంది. మూవీ రిలీజ్ కి కరెక్ట్ గా ఒక రోజు ముందు జరిగిన పరిస్థితులే ఇందుకు కారణమట. బాబాయ్ తో పోటీ - పొంగల్ రేస్ లతో అప్పటికే సతమతమవుతున్న జూనియర్ కి.. పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన షాక్ విపరీతంగా ఎఫెక్ట్ చూపించిందట. రెమ్యూనరేషన్ విషయంలో బీవీఎస్ ఎన్ ప్రసాద్ రెండు కోట్లు బాకీ ఉన్నాడంటూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి పవన్ కంప్లెయింట్ చేయడం తెలిసిందే. తర్వాత ఇది సెటిల్ అయినా.. అప్పటి సిట్యుయేషన్ లో మాత్రం ఒక్కసారిగా సింపతీ జనరేట్ అయింది.
ఈ పరిస్థితి అమెరికా కలెక్షన్లపై కూడా గట్టిగానే ఎఫెక్ట్ చూపించింది. నిజానికి జూనియర్ నటించిన టెంపర్ కూడా అక్కడ బాగానే పెర్ఫామ్ చేసింది. ఆ మూవీకి 5 కోట్ల వసూళ్లు రాగా.. ఇప్పుడు నాన్నకు ప్రేమతో ఏకంగా 13కోట్లకు పైగా రాబట్టడం విశేషం.