Begin typing your search above and press return to search.
నారా రోహిత్.. ఎందుకు నిర్మాతయ్యాడంటే
By: Tupaki Desk | 30 Dec 2016 6:07 AM GMTనారా రోహిత్ బ్యాగ్రౌండ్ ప్రకారం చూస్తే ఈపాటికి ఎప్పుడో నిర్మాత అయి ఉండొచ్చు. కానీ అతడికి ఆ అవసరం రాలేదు. వైవిధ్యమైన కథలతో తక్కువ బడ్జెట్లో సినిమాలు చేసే రోహిత్ కోసం ఎప్పుడూ నిర్మాతలు క్యూలో ఉంటారు. అయినప్పటికీ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాను ‘అసుర’ దర్శకుడు కృష్ణవిజయ్.. ప్రశాంతిలతో కలిసి తనే స్వయంగా నిర్మించాడు రోహిత్. ఇది సాహసోపేత కథ కావడమే అందుకు కారణమని అంటున్నాడు రోహిత్.
‘‘అప్పట్లో ఒకడుండేవాడు మామూలు కథ కాదు. ఇది నా మనసుకు ఎంతగానో నచ్చిన చిత్రం. ఇందులో ఎన్నో అంశాలు చూపించాం. దర్శకుడు 90ల నాటి నేపథ్యంలో అనేక ఆసక్తికర అంశాల్ని చర్చించాడు. ఇలాంటి కథను రెండు గంటల్లో చెప్పడం చాలా కష్టం. ఇందులో చాలా రిస్క్ ఉంది. నాకు స్క్రిప్టు బాగా నచ్చడం వల్ల కూడా ఈ సినిమాను నేనే నిర్మించాలనుకున్నా. ఎక్కడా రాజీ పడకూడదనుకున్నా.
నేనే నిర్మాత కాబట్టి.. సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి రీషూట్లు చేయడానికి కూడా వెనుకాడలేదు. మరొకరైతే ఇందుకు అవకాశముండేది కాదు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా చేస్తూ చాలా ఆస్వాదించాను. నా డెబ్యూ మూవీ ‘బాణం’ తర్వాత రిలీజ్ కు ముందు నన్ను బాగా ఎగ్జైట్ చేస్తున్న సినిమా ఇది. సినిమా మీద నాకు పూర్తి విశ్వాసముంది. నా కెరీర్లో ఒక మైలురాయిలాగా ఈ సినిమా నిలుస్తుంది’’ అని రోహిత్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/