Begin typing your search above and press return to search.
తన సినిమాకు ‘కంచె’ వేశారనే నిఖిల్ బాధ
By: Tupaki Desk | 13 Oct 2015 10:30 PM GMTగొడవ జరుగుతోంది మెగా ఫ్యామిలీకి, దాసరి నారాయణరావుకి. ఈ గొడవ ఈనాటిది కాదు. దశాబ్దాలుగా నడుస్తోంది. చిరంజీవిపైనో, రామ్ చరణ్ పైనో సెటైర్ వేసే అవకాశం వస్తే వదలరు కాబట్టి దాసరి తనదైన శైలిలో బ్రూస్ లీ టీం మీద నిన్నో పంచ్ వేసేశాడు. దానికి అల్లు అర్జున్ తో పాటు బ్రూస్ లీ డైరెక్టర్ శ్రీను వైట్ల కూడా సమాధానం కూడా చెప్పారు. మెగా ఫ్యామిలీ వెర్సస్ దాసరి గొడవ అలా నడుస్తుంటే.. మధ్యలో యువ కథానాయకుడు నిఖిల్ ఎంటరయ్యాడు. అల్లు అర్జున్ ను సపోర్ట్ చేస్తూ తప్పంతా రుద్రమదేవిదేనన్న అర్థంలో ట్వీట్ పెట్టాడు. పెద్ద సినిమాలు ఇలా మళ్లీ మళ్లీ ఇలా వాయిదా వేస్తే చిన్న సినిమాలకు ఎంత ఇబ్బందో తెలుసా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. బాలీవుడ్లో ఇలా డేటు మారిస్తే మళ్లీ ఆర్నెల్ల వరకు రిలీజ్ కు ఛాన్సే ఉండదు తెలుసా అన్నాడు.
ఐతే నిఖిల్ తనకు సంబంధం లేని గొడవలో ఇలా తలదూర్చి.. తన వాయిస్ వినిపించడానికి కారణం లేకపోలేదు. పోయిన ఏడాది దీపావళికి కార్తికేయ మూవీతో బంపర్ హిట్టు కొట్టిన నిఖిల్.. ఈ దీపావళికి కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేద్దామని సెంటిమెంటుగా తన కొత్త సినిమా శంకరాభరణం రిలీజ్ ప్లాన్ చేసుకున్నాడు. దీపావళి ముందు వీకెండ్ లో నవంబరు 6న రిలీజ్ డేట్ ఇచ్చాడు.కానీ అనుకోకుండా అదే తేదీకి కంచె వచ్చి పడింది. నిజానికి కంచె సినిమా అక్టోబరు 2న విడుదల కావాల్సింది. కానీ ఏవో కారణాలతో నవంబరు 6కు వాయిదా పడింది. సెప్టెంబరులోనే రావాల్సిన బెంగాల్ టైగర్ కూడా ఉన్నట్లుండి దీపావళి రిలీజ్ కు రెడీ అయిపోయింది. దీంతో నిఖిల్ సినిమాకు బ్యాండ్ పడిపోయింది. రిలీజ్ డేట్ మార్చుకోక తప్పని పరిస్థితి. ఈ ఆవేదనతోనే నిఖిల్ అలా స్పందించాడు.