Begin typing your search above and press return to search.
ఎన్.టీ.ఆర్ లో జూనియర్.. కాని..
By: Tupaki Desk | 14 April 2018 2:30 AM GMTనందమూరి తారక రాముడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్.టీ.ఆర్’ బయోపిక్ కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తండ్రి పాత్రలో తనయుడు బాలకృష్ణ నటిస్తుండడం... ఈ సినిమాలో ఆయన ఏకంగా 60కి పాత్రల్లో కనిపిస్తారనే టాక్ రావడం...అన్నింటికీ మించి నందమూరి వారసులంతా ఈ సినిమాలో కనిపించబోతున్నారనే సమాచారమే ఇంతటి క్రేజ్ కి కారణం.
అయితే నందమూరి వంశంలో యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ మాత్రం ఇందులో నటించడం లేదు. ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్ ప్రెస్ మీట్ లో ఆ విషయం స్పష్టం చేశాడు తారక్. అయితే మిగిలిన వారితో పోలిస్తే తాత పోలికలు జూనియర్ లోనే ఎక్కువగా కనిపిస్తాయి. నటనలో అయితే తిరుగే లేదు. ఎటువంటి పాత్రనైనా అవలీలగా చేసేయగలడు. అలాంటి చిన్న ఎన్.టీ.ఆర్... తారక రాముని యుక్త వయసు పాత్రలో కనిపిస్తే బాగుంటుందని నందమూరి అభిమానుల ఆశ. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అబ్బాయికీ- బాబాయికీ మధ్య సంబంధాలు సరిగా లేవు. అయితే ఈ సినిమాలో హరికృష్ణ పాత్రలో ఆయన పెద్ద కొడుకు కల్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. హరికృష్ణ- తారక రత్న- మోక్షజ్ఞ కూడా ఎన్.టీ.ఆర్ బయోపిక్ లో కనిపిస్తారట. మరి తారక్ మాత్రం ఎందుకు లేడంటే... కొన్ని వర్గాల నుంచి ఓ రూమర్ వినిపిస్తోంది.
అదేంటంటే... నందమూరి హీరోల్లో తాత తర్వాత అంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో తారక్ మాత్రమే. అందుకే ఆయనంటే బాలకృష్ణకి ఇష్టంలేదని... ఆ కారణంగానే నందమూరి ఫ్యామిలీ అభిమానులను ఆయనకు దూరం చేసేందుకే బాలయ్య బయోపిక్ లో అవకాశం ఇవ్వట్లేదని అనుకుంటున్నారు. ఈ రూమర్ విషయం పక్కన పెడితే... ‘బిగ్ బాస్’తో బుల్లి తెర ప్రేక్షకులకు కూడా చేరువైన తారక్ ఇమేజ్ ఇప్పుడు ఎవరు తగ్గించాలనుకున్నా పోదు. అధ్భుతమైన నటనా- అదరగొట్టే డ్యాన్స్- విజిల్స్ వేయించే డైలాగ్ డెలీవరీ ఇవన్నీ ఉండగా.. వేరే విషయాలు పెద్దగా ఇలాంటి హీరోలను ప్రభావితం చెయ్యవులే.