Begin typing your search above and press return to search.

అంతరిక్షం సైలెన్స్ కి అర్థమేంటో?

By:  Tupaki Desk   |   27 Nov 2018 5:49 AM GMT
అంతరిక్షం సైలెన్స్ కి అర్థమేంటో?
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమా అంతరిక్షం 90000 కెఎంపిహెచ్ విడుదలకు ముస్తాబవుతోంది. మొదటి స్పేస్ థ్రిల్లర్ గా ప్రత్యేకతను సంతరించుకున్న ఈ మూవీకి సంకల్ప్ రెడ్డి దర్శకుడు. ఘాజీని తక్కువ బడ్జెట్ లోనే ఉన్నత ప్రమాణాలతో రూపొందించి జాతీయ స్థాయిలో అవార్డుతో పాటు ప్రశంశలు కూడా దక్కించుకున్న సంకల్ప్ రెడ్డి దీన్ని కూడా సాధ్యమైనంత తక్కువ టైంలోనే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు తీసుకెళ్లిపోయాడు. డిసెంబర్ 21 విడుదల అంటూ వివిధ సందర్భాల్లో రెండు మూడు పోస్టర్లు వదిలారు.

తీరా చూస్తే రిలీజ్ కు పాతిక రోజుల సమయం కూడా లేదు. ప్రమోషన్ హడావిడి ఏమి కనిపించడం లేదు. ట్రైలర్-ఆడియో-ప్రీ రిలీజ్-మీడియా ఇంటర్వ్యూస్ ఇలా చాలా పనులు మొదలుపెట్టనే లేదు. టైం ఉంది కదా అని చెప్పేందుకు లేదు. మరోవైపు కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో అంతరిక్షం-ఎఫ్2 విడుదల కావడం పట్ల వరుణ్ తేజ్ హ్యాపీగా లేడని పైగా అన్నయ్య రామ్ చరణ్ తో సంక్రాంతికి పోటీ పడటం గురించి కాస్త అసంతృప్తితో ఉన్నాడని ఇప్పటికే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంతరిక్షం టీమ్ ఇంత సైలెంట్ గా ఉండటం కూడా కొత్త అనుమానాలు రేపుతోంది.

అంతరిక్షం నిర్మాతల్లో ఒకరైన క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లే ఇక్కడ ఫోకస్ పెట్టలేకపోతున్నట్టు మరో న్యూస్ కూడా ఉంది. ఇదంతా పక్కన పెడితే డిసెంబర్ 21 ఫిక్స్ అయితే మాత్రం అంతరిక్షం సందడి ఇప్పటి నుంచే మొదలుపెట్టాలి. అసలే ఆ తేదికి పోటీ విపరీతంగా ఉంది. ఒక ప్రత్యేకమైన జానర్ కు చెందిన అంతరిక్షంకు భారీగా ఓపెనింగ్స్ దక్కాలి అంటే పబ్లిసిటీ ఇప్పటి నుంచే మొదలుపెట్టాలి. మరి ఈ స్పీడ్ ఎప్పుడు పెరిగేనో.