Begin typing your search above and press return to search.
తమన్నాపై రూమర్లు ఎందుకు రావంటే..
By: Tupaki Desk | 6 Nov 2016 3:30 PM GMTసినిమా నటి అన్నాక రూమర్లు సహజం. ఆ హీరోతో ఎఫైర్.. ఈ దర్శకుడితో డేటింగ్ అంటూ రకరకాల రూమర్లు హల్ చల్ చేస్తుంటాయి. ఐతే మిల్కీ బ్యూటీ తమన్నా మీద ఈ తరహా రూమర్లు తక్కువే. అప్పట్లో ఒక బాలీవుడ్ దర్శకుడితో ఏదో వ్యవహారం అంటూ ఓ గాసిప్ వినిపించింది కానీ.. అది మినహా ఇలాంటి వార్తలు మరేమీ రాలేదు. నటిగా తాను ఎంచుకునే పాత్రలు.. తన నటన.. తన అంకిత భావమే తనపై రూమర్లు పెద్దగా రాకపోవడానికి కారణం అంటోంది తమన్నా. ఇక హీరోయిన్ల గురించి ఇలాంటి రూమర్లు పుట్టించడం మానుకోవాలని.. వాళ్లకూ ఓ కుటుంబం ఉంటుందని గుర్తుంచుకుని.. ఇలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని ఆమె కోరింది.
‘‘నటీనటుల జీవితం మిగతా వాళ్లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. వారికి సంబంధించిన ప్రతి విషయం మీదా ప్రేక్షకులు ఆసక్తి ప్రదర్శిస్తారు. నటీనటుల నడవడిక.. వారు వేసుకునే దుస్తులు.. వాళ్ల అభిప్రాయాలు.. అన్నింటినీ సాధారణ ప్రజలు అనుసరించాలని అనుకుంటారు. ఐతే వాళ్లపై జనాల ఫోకస్ ఎక్కువుంటుంది కాబట్టి గాసిప్స్ కూడా అదే స్థాయిలో ప్రచారమవుతుంటాయి. ఐతే ఇలాంటి గాసిప్స్ వల్ల కొందరు హీరోయిన్లు మనస్తాపానికి గురవుతున్నారు. వాళ్లకూ కుటుంబం ఉంటుంది. తమ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో అని ఆవేదన చెందుతుంటారు. ఈ గాసిప్స్ సంస్కృతి రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇది సరి కాదు. కొందరు వీటిని పట్టించుకుంటారు. కొందరు లైట్ తీసుకుంటారు. ఐతే నటిగా మంచి పేరు సంపాదిస్తే ఇలాంటి రూమర్లను గెలవొచ్చు. మంచి నటన కనబరిస్తే జనాలు వీటి గురించి మరిచిపోతారు. వాళ్లే ఇలాటి గాసిప్స్ ను కొట్టిపడేస్తారు. నేను అదే బాటలో నడుస్తున్నా. నాకు మంచి పాత్రలు.. సినిమాలు అమరుతున్నాయి. అందువల్లే నా గురించి గాసిప్స్ ప్రచారం కావట్లేదు. బాహుబలిలో నా పాత్ర ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. వరుసగా మంచి కథలున్న సినిమాల్లోనే నటించాలని ఆశిస్తున్నా’’ అని తమన్నా పేర్కొంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/