Begin typing your search above and press return to search.
‘భరత్’ కోసం ఎన్టీఆర్ ను పిలవడం వెనుక..
By: Tupaki Desk | 15 April 2018 6:11 AM GMTకొన్ని రోజుల కిందట మహేష్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రావడం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఈ కలయిక ఎవ్వరూ ఊహించనిది. ‘భరత్ అనే నేను’ దర్శకుడు కొరటాల శివకు ఎన్టీఆర్ ఆప్తుడు కాబట్టి అతనే తన ఫ్రెండుని ఈ వేడుకకు పిలిచి ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ను ఈ ఫంక్షన్ కు పిలవడంలో తన కంటే మహేష్ ప్రమేయమే ఎక్కువ అని అంటున్నాడు కొరటాల. మహేష్ నుంచే ఈ ప్రపోజల్ వచ్చిందని.. ఆ తర్వాత తాను ఎన్టీఆర్ కు ఫోన్ చేసి వేడుకకు ఆహ్వానించానని అన్నాడు కొరటాల.
‘భరత్ అనే నేను’ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం ముందు వేరే వేదికలు అనుకున్నామని.. ఐతే షూటింగ్ కొంచెం ఆలస్యం కావడంతో చివరికి హైదరాబాద్ లోనే వేడుక చేయాలని అనుకున్నామని అన్నాడు కొరటాల. ఈ వేడుకకు సంబంధించిన ప్రణాళికల్లో ఉండగా.. మహేష్ తనతో మాట్లాడుతూ.. ‘ఫంక్షన్ అంటే బోర్ కొడుతోంది. సంవత్సరం అంతా మన ముఖాలు మనమే చూసుకుని ఫంక్షన్లోనూ మనమేనా? ఎవరైనా గెస్ట్ వస్తే బాగుంటుంది కదా’ అని మహేష్ అన్నాడని.. ఎవరిని పిలుద్దామా అనుకున్నపుడు ఎన్టీఆర్ పేరు కూడా మహేషే చెప్పాడని.. తాను మరో ఆలోచన లేకుండా అంగీకరించానని కొరటాల తెలిపాడు. తర్వాత ఎన్టీఆర్ కు తాను ఫోన్ చేస్తే జోక్ చేస్తున్నారా అని అన్నాడని.. కానీ నిజంగానే రావాలని చెబితే.. వచ్చి రెండు గంటల సేపు ఎంజాయ్ చేస్తా అని చెప్పి రావడానికి అంగీకరించాడని కొరటాల చెప్పాడు. ఎన్టీఆర్ రావడం వల్ల ఈ వేడుక తమకు చాలా ప్రత్యేకంగా మారిందని అన్నాడు.