Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ డైరెక్టర్ గురించి టెన్షనెందుకు?

By:  Tupaki Desk   |   7 Dec 2016 7:42 AM GMT
ఎన్టీఆర్ డైరెక్టర్ గురించి టెన్షనెందుకు?
X
ఒక సినిమా హిట్టయినా.. ఫ్లాప్ అయినా.. అందుకు ప్రధాన బాధ్యత దర్శకుడిదే అనడంలో సందేహం లేదు. ఐతే అన్ని సినిమాలకూ ఇది వర్తించదు. ఉదాహరణకు ఈ ఏడాది సమ్మర్లో వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫ్లాప్ కావడంలో దర్శకుడు బాబీ పాత్ర పరిమితం అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా స్క్రిప్టు విషయంలో అతడి పాత్ర చాలా తక్కువ. ఈ సినిమాకు కథ.. స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణే అందించాడు. మాటలు సాయిమాధవ్ బుర్రా రాశాడు.

రెండేళ్ల పాటు తన రచయితల బృందంతో కలిసి అనేకానేక మార్పులు చేసి స్క్రిప్టు సిద్ధం చేశాడు పవన్. మధ్యలో సంపత్ నందిని తప్పించి బాబీని దర్శకుడి పాత్రలోకి తెచ్చారు. షూటింగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనలకు తగ్గట్లు.. ఆయన ప్లాన్ ప్రకారమే సాగిందన్నది వాస్తవం. చివరి రెండు నెలల్లో హడావుడిగా రేయింబవళ్లు షూటింగ్ చేశారు. మొత్తంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫ్లాపవడంలో బాబీ పాత్ర తక్కువ. కాబట్టి ఈ సినిమా ఆడలేదని అతణ్ని ఫ్లాప్ డైరెక్టర్ అనడం ఎంతమాత్రం సబబు కాదు.

కాబట్టి నందమూరి అభిమానులు కానీ.. మిగతా జనాలు కానీ ఎన్టీఆర్‌ తో బాబీ సినిమా చేస్తున్నందుకు ఎంతమాత్రం కంగారు పడాల్సిన పని లేదు. దర్శకుడిగా బాబీ పనితనం ఏంటన్నది ‘పవర్’ సినిమాలో అందరూ చూశారు. అంతకుముందు భద్ర.. డాన్ శీను.. మిస్టర్ పర్ఫెక్ట్.. బలుపు.. లాంటి హిట్ సినిమాలకు బాబీ రచయితగా పని చేశాడు. వాటి కోణంలో చూసి బాబీని అంచనా వేయాలి తప్ప ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు ముడిపెట్టి కాదు. ఎన్టీఆర్ ఇలా ఆలోచించాడు కాబట్టే అతడికి ఛాన్సిచ్చాడు. కాబట్టి నందమూరి ఫ్యాన్స్ నిశ్చింతగా ఉండొచ్చు. మిగతా జనాలు కూడా బాబీని ఫ్లాప్ డైరెక్టర్ అనడం మానేస్తే బెటర్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/