Begin typing your search above and press return to search.
ఓంకార్.. తమ్ముడితో ఎందుకు చేశాడంటే..
By: Tupaki Desk | 19 Oct 2015 5:30 PM GMTబుల్లితెర యాంకర్ ఓంకార్ గురించి పరిచయాలక్కర్లేదు. ఆట ప్రోగ్రాంతో బాగానే పాపులారిటీ సంపాదించాడతను. ఆ పాపులారిటీతో వరుసబెట్టి మరిన్ని రియాల్టీ షోలు వదలడమే కాదు.. దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం కూడా చేశాడు. కానీ అతడి తొలి ప్రయత్నం జీనియస్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయినా నిరాశ చెందకుండా ఇప్పుడు తన ’రాజుగారి గది’ అనే హార్రర్ కామెడీ మూవీతో దసరా బరిలో దిగుతున్నాడు. ఈ సినిమాలో ఓంకార్ తమ్ముడైన అశ్విన్ హీరోగా నటిస్తుండటం విశేషం. ఐతే ఈ సినిమా తన తమ్ముడితోనే చేయడానికి కారణం లేకపోలేదంటున్నాడు ఓంకార్. ఆ కారణమేంటో అతడి మాటల్లోనే విందాం పదండి.
‘‘మా తమ్ముడు అశ్విన్ మంచి డ్యాన్సర్ కూడా. ఆట-3 షోలో అతను వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ కూడా. తను మా తమ్ముడని చివరి వరకూ నేనెవ్వరికీ చెప్పలేదు. అతను ఆ షోలో బాగా పెర్ఫామ్ చేశాడు. ఐతే ఏదో ఒక దశలో తనెవరో తెలుస్తుంది కాబట్టి.. అతను ఫైనల్లో గెలిస్తే నా తమ్ముడు కాబట్టే గెలిచాడు అంటారని భావించి.. ముందే ఎలిమినేట్ అవమన్నాను. అతను నా మాటను మన్నించి తప్పుకున్నాడు. ఐతే నా మాటను గౌరవించినందుకు తనకు ఇంకేదైనా చేయాలనుకున్నా. అందుకే అతను హీరోగా సినిమా చేయాలనుకున్నా. జీనియస్ కథ అతడి కోసమే రాశా. అతడితోనే ఆ సినిమా తీద్దామనుకున్నా. కానీ నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో అశ్విన్ తో చేయలేకపోయా. ఇప్పుడు తక్కువ బడ్జెట్ తో మంచి సినిమా కుదరడంతో మా తమ్ముడిని హీరోను చేయగలిగా’’ అని ఓంకార్ చెప్పాడు.