Begin typing your search above and press return to search.
అందుకే ఈ కథను వద్దనేసి ఉంటారు
By: Tupaki Desk | 19 Oct 2017 4:36 AM GMTమొన్ననే దిల్ రాజు గారు ఒక మాటన్నారు. ఏదైనా కథ రాసిపెట్టుంటేనే వస్తుంది అని. అదిగో సుమంత్ మిస్సయిన తొలిప్రేమ.. పవన్ కళ్యాణ్ మిస్సయిన ఈడియట్.. రవితేజ్ మిస్సయిన పోకిరి అంటూ చాలా సినిమాలే చూపించవచ్చు. కాని అదే తరహాలో రామ్ మిస్సయిన ఊసరవెల్లి సినిమాను ఎన్టీఆర్ చేస్తే రిజల్ట్ ఎలా ఉందో కూడా మనం చూసుకోవాలి. ఇంతకీ రాజు గారు ఏమన్నారంటే.. 'రాజా ది గ్రేట్ చాలామంది వదిలేసుకున్నారు.. ఆ కథ రవితేజ మాత్రమే చేయాలని ఉంది' అంటూ చెప్పారు.
కాకపోతే సినిమా హిట్ అయ్యిన తరువాత ఇలాంటి కామెంట్లు చేసుంటే బాగుండేది. కాని రాజు గారు మాత్రం ముందే చెప్పేశారు. ఇక రాజా ది గ్రేట్ విషయానికి వస్తే.. అసలు ఫస్ట్ హాఫ్ లో కథ లేదు. సెకండాఫ్ లో సీన్లు కూడా లేవు. హీరో విలన్ ను కొట్టేశాక ఒక సాంగేసి మళ్ళీ ఫైటేసి.. మళ్ళీ సీనేసి మళ్ళీ ఫైటేసి.. చాలు బాబోయ్ అన్నంతవరకు లాగేశారు సినిమాను. హీరో అంధుడు అని తప్పిస్తే.. సినిమాలో విషయం లేదని ఎవ్వరికైనా తెలుస్తోంది. అటు ఇటూ తిప్పితే.. ఒక ఊరెళ్ళి ఒక అమ్మాయిని కాపాడటం అనేది 'ఒక్కడు' సినిమా నుండి మనం చూస్తున్న కాన్సెప్టే. అదే కాన్సెప్టును మళ్లీ చెప్పారంతే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. అసలు ఈ కథలో విషయం లేదు కాబట్టే దీనిని రామ్ అండ్ ఎన్టీఆర్ తదితర హీరోలు రిజెక్ట్ చేసుంటారు అంటున్నారు సినిమా లవ్వర్స్.
అయితే సినిమాలో పూర్తి స్థాయి కామెడీ ఉండటం వలన కలక్షన్లు బాగా రావొచ్చేమో కాని.. అయినంతమాత్రాన ఇది సిరివెన్నెల రేంజ్ క్లాసిక్ అవ్వదు. అలాగే ఇతర హీరోలు ఈ సినిమాను మిస్సయిపోయి జీవితంలో ఏదో కోల్పోయారు అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు.