Begin typing your search above and press return to search.

పవన్ వస్తున్నది రవితేజ కోసం కాదు

By:  Tupaki Desk   |   5 May 2018 6:30 AM GMT
పవన్ వస్తున్నది రవితేజ కోసం కాదు
X
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ‘నేల టిక్కెట్టు’ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ రాబోతున్నాడని కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. ఈ నె10న జరగబోయే ఈ వేడుకకు పవన్ వస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పవన్ ను తన సినిమా వేడుకకు రప్పించుకోవాలని రవితేజకు ఎందుకనిపించింది.. మామూలుగా మాస్ రాజా ఇలాంటి ప్రయత్నాలేమీ చేయడే.. అయినా పవన్ తో అతడికి సాన్నిహిత్యం తక్కువే కదా అని జనాలు చర్చించుకుంటున్నారు. ఐతే వాస్తవం ఏంటంటే.. పవన్ వస్తున్నది రవితేజ పిలుపు మేరకు కాదు. ‘నేల టిక్కెట్టు’ చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి కోసం. అతడితో పవన్ కు దగ్గరి సంబంధాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వ్యాపారవేత్త అయిన రామ్ కొన్నేళ్ల నుంచి పవన్ తో సన్నిహితంగా మెలుగుతున్నాడట. పవన్ పెట్టిన జనసేన పార్టీకి ఆయన ఆర్థిక సాయం కూడా అందిస్తున్నాడట. ఆ పార్టీకి సంబంధించిన ఈవెంట్లను.. సాంస్కృతిక కార్యక్రమాలను ఈయనే ఆర్గనైజ్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ పరిచయం తోటే పవన్ ను ‘నేల టిక్కెట్టు’ ఆడియో వేడుకకు పిలవగానే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పవన్ తమ సినిమా వేడుకకు రాబోతున్న విషయాన్ని ట్విట్టర్లో ప్రకటిస్తూ.. తన విజ్ఞప్తి మేరకే ఆయన వస్తున్న విషయాన్ని కూడా రామ్ ధ్రువీకరించాడు. మొత్తానికి పవన్ గురించి ఏదో అనుకుంటాం కానీ.. ఆయనకు ఇలాంటి సన్నిహితులు చాలామంది ఉన్నారని.. సినిమాలు.. పార్టీ విషయంలో సాయం చేస్తుంటారని అర్థం చేసుకోవాలి. ఈ మధ్య ‘రంగస్థలం’ సక్సెస్ మీట్ కు పవన్ వెళ్లింది కూడా కేవలం రామ్ చరణ్ కోసం కాదు. ఆ చిత్ర నిర్మాతలకు సినిమా చేసి పెడతానని గతంలో అడ్వాన్స్ తీసుకుని వెనక్కివ్వలేదట పవన్. ఆ సినిమా చేస్తాడో లేదో కానీ.. ప్రస్తుతానికి ఒక రోజు సినిమా చూడటం కోసం.. ఇంకో రోజు సక్సెస్ మీట్ కోసం కేటాయించి వాళ్లను తాత్కాలికంగా సంతృప్తిపరిచాడు.