Begin typing your search above and press return to search.
అలీని అందుకే పవన్ పరామర్శించలేదు
By: Tupaki Desk | 21 Dec 2019 7:56 AM GMTహాస్యనటుడు అలీ తల్లి గారైన జైతున్ బీబీ స్వర్గస్తులైన క్రమంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అలీని పరామర్శించిన సంగతి తెలిసిందే. ప్రముఖులంతా స్వయంగా వెళ్లి జైతున్ బీబీ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. చిరంజీవి- నరేష్- జీవిత రాజశేఖర్.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు అలీని కలిసి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే అలీకి ఎంతో గొప్ప స్నేహితుడైన పవన్ కళ్యాణ్ మాత్రం సోషల్ మీడియా ద్వారానే నివాళులు అర్పించారు. వ్యక్తిగతంగా అలీని కలిసి పరామర్శించింది లేదు.
దీంతో సోషల్ మీడియా రకరకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. రాజకీయంగా ఇద్దరి మధ్య చిన్నపాటి విబేధాల కారణంగానే పవన్ పరామర్శకు వెళ్లలేదని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు రాగా.. ఏపీ రాజకీయ అంశాలపై బిజీగా ఉండటం వల్ల వెళ్లలేకపోయారని కొందరు ప్రచారం చేశారు. తాజాగా మరో సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. అలీకి తల్లి అంటే పంచ ప్రాణాలు. పబ్లిక్ గానే చాలాసార్లు తన తల్లి ప్రేమ గురించి చెప్పాడు. గతంలో అలీ తల్లి కాళ్లుపడుతు కొడుకుగా రుణం తీర్చుకునే ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది. అప్పుడే అర్ధమైంది అలీకి తల్లి అంటే ఎంత ప్రేమ అనేది. ఇక తల్లి మరణంతో అలీ ఎంత కుంగిపోయాడో మొన్నటి సన్నివేశమే చెప్పింది. వీటన్నింటి కారణంగానే పవన్ స్వయంగా అలీని ఆ రోజు పరామర్శించడానికి వెళ్లలేదని అంటున్నారు. పవన్- అలీ మధ్య ఉన్న బాండింగ్ కారణంగా అలీ ఎమోషన్ ని అదుపు చేసుకోలేడు. దాంతో పవన్ కూడా కన్నీటి పర్యంతమవుతాడు.
సామాన్య జనాల విషయంలోనే పవన్ వ్యక్తిగతంగా ఎంతో కనెక్ట్ అవుతారు. అలాంటింది ప్రాణ స్నేహితుని తల్లి మరణిస్తే తట్టుకోగలడా? అందువల్లనే పవన్ ఆరోజు ఇంటికి వెళ్లలేదని ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు అన్నారు. ఘంటశాల స్వర్గస్తులైనప్పుడు అక్కినేని నాగేశ్వరావు కూడా ఆయన భౌతిక కాయాన్ని చూడటానికి వెళ్లలేదు. దీంతో ఏఎన్నార్ పై కొన్ని నెగిటివ్ కథనాలు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్య విబేధాలున్నాయని అందువల్లే ఎఎన్నార్ చివరి చూపునకు అయినా రాలేదని ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత ఏఎన్నార్ అసలు విషయాన్ని వెల్లడించారు. ఘంటసాల భౌతికకాయన్ని చూసి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకొచ్చి `నా ఊపిరి ఆగిపోతే ఎలా?` అని ఓ సందర్భంలో ఎమోషన్ కి గురయ్యారు. అంతేకాదు రవితేజ సైతం తన సోదరుడు యాక్సిడెంట్ లో మరణిస్తే స్పాట్ కి చూసేందుకైనా వెళ్లలేదు. దానికి కారణం తమ్ముడిని అలా చూడలేకనే. సోదరుడిని చివరిసారిగా చూసిన జ్ఞాపకాన్ని అలానే ఉంచాలని .. యాక్సిడెంట్ దృశ్యాన్ని చివరి ఘట్టాన్ని చూడలేనని రవితేజ ఆవేదనగా అన్న సంగతిని సీనియర్ జర్నలిస్ట్ ఇమంది ఈ సందర్భంగా గుర్తు చేశారు.