Begin typing your search above and press return to search.
పవన్ చల్ అన్నది అందుకే
By: Tupaki Desk | 4 April 2018 7:44 AM GMTరేపు విడుదల కానున్న నితిన్ చల్ మోహనరంగా గురించి అతని ఫాన్స్ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ నటించకపోయినా ఆయన బ్యానర్ మీద నిర్మించిన సినిమా కాబట్టి వాళ్ళకు దీని మీద గట్టి హోప్స్ ఉన్నాయి. పైగా త్రివిక్రమ్ సహ నిర్మాతగా మారడంతో పాటు కథను అందించాడన్న వార్త షూటింగ్ మొదలుకాక ముందే దీని మీద ఆసక్తిని పెంచింది. కాని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రొడక్షన్ లో జాయిన్ అయ్యాడు అనే దాని గురించే కొన్ని అనుమానాలు అలాగే మిగిలిపోయాయి. వాటికి నితిన్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసాడు. పవన్ ఎందుకు నిర్మాతగా తనతో తీయడానికి సిద్ధపడ్డాడో కారణం వివరించాడు.
నితిన్ అఆ చేస్తున్న సమయంలో త్రివిక్రమ్ ఒక లైన్ వినిపించాడు. చాలా బాగా నచ్చిన నితిన్ తనకు మంచి ఫ్రెండ్ అయిన కృష్ణ చైతన్యను పిలిపించాడు. అతనితో సినిమా చేసే కమిట్మెంట్ ఉండటం వల్ల ఈ కథ నచ్చే అవకాశం ఉందని రమ్మని చెప్పాడు. కృష్ణ చైతన్య త్రివిక్రమ్ చెప్పిన లైన్ కు ఇంప్రెస్ అయిపోయి ఎగ్జైట్ మెంట్ తో దీన్ని పూర్తిగా డెవలప్ చేసుకొస్తానని వెళ్లి ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసాడు. శ్రేష్టా బ్యానర్ పై దీన్ని నిర్మించడానికి నాన్న సుధాకర్ రెడ్డి తొలుత ముందుకు వచ్చారు. ఆ తర్వాత త్రివిక్రమ్ నితిన్ తో పవన్ ఓసారి మీటింగ్ లో ఉన్నప్పుడు చల్ మోహనరంగా గురించి విన్నాడు. ఇంకేముంది కథ విపరీతంగా నచ్చిన పవన్ తన బ్యానర్ ను కూడా ఇందులో చేర్చేసి భాగస్వామిని అవుతానని చెప్పడంతో పవన్ అంటే ప్రాణమిచ్చే నితిన్ ఎందుకు కాదంటాడు.
తనకు జీవితంలో అత్యంత ఇష్ట మైన ముగ్గురు వ్యక్తులు నాన్న సుధాకర్ రెడ్డి-అతడు సినిమా ద్వారా తనలో స్ఫూర్తి రగిలించిన త్రివిక్రమ్-హీరో కావాలనే గోల్ పెట్టుకునేలా చేసిన పవన్ కళ్యాణ్ ఇలా తన మూవీ కోసం కలిసికట్టుగా టీం కావడంతో నితిన్ చల్ మోహనరంగా విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకున్నాడు. ఏ మాత్రం తేడా వచ్చినా పవన్ కు త్రివిక్రమ్ కు కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఒకటికిరెండు సార్లు అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుని చల్ మోహనరంగా తీర్చిదిద్దారట. అందుకే నితిన్ దీని విషయంలో ఇంత యాంగ్జైటీగా ఉన్నాడు.