Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఇంట్లో కార్తీక మాసం పూజ‌లు

By:  Tupaki Desk   |   12 Nov 2015 11:30 AM GMT
ప‌వ‌న్ ఇంట్లో కార్తీక మాసం పూజ‌లు
X
విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న‌ కోసం ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ పంచెక‌ట్టుతో వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మొన్న‌టిదాకా స‌ర్దార్ కోసం ఖాకీ క‌ట్టిన ప‌వ‌న్ అదే వేషంలోనే ప‌లు ప్రెస్‌ మీట్ల‌లో పాల్గొన్నారు. ఇక సినిమా పూర్త‌య్యేవ‌ర‌కు ఆ వేషం నుంచి బ‌య‌టికి రాడేమో అని జ‌నాలు మాట్లాడుకున్నారు. కానీ ఉన్న‌ట్టుండి ప‌వ‌న్ తెల్ల‌చొక్కా, తెల్ల పంచాలో క‌నిపించేస‌రికి అందరూ ఆశ్చ‌ర్య‌పోయారు. అభిమానులైతే ప‌వ‌న్ కొత్త గెట‌ప్ అదిరిందంతే అని సంబ‌ర‌ప‌డిపోయారు.

అయితే ప‌వ‌న్ రైతుల పక్షాన మాట్లాడ్డానికి వెళ్ల‌డంవ‌ల్లే పంచెక‌ట్టాడ‌ని మీడియాలో వార్త‌లొచ్చాయి. కానీ అస‌లు విష‌యం అది కాదట‌. ప‌వ‌న్ ఇంట్లో కార్తీక మాసం పూజ‌లు మొద‌ల‌యిన‌ట్టు స‌మాచారం. గురువారం ఉద‌యం ఇంట్లో జ‌రిగిన కార్తీక మాసం పూజ‌ల‌కోసం ప‌వ‌న్ మ‌న సంప్ర‌దాయానికి త‌గ్గ‌ట్టుగా తెల్ల‌దుస్తులు ధ‌రించారు. అవే దుస్తుల్లోనే ఫ్లైటెక్కి విజ‌య‌వాడ వెళ్లిపోయారు. ప‌వ‌న్ పంచె క‌ట్టుతో వ‌చ్చేస‌రికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా `మీ పంచె క‌ట్టు బాగుంది` అని కితాబిచ్చిన‌ట్టు తెలిసింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు కార్తీక‌మాసం పూర్త‌య్యేవ‌ర‌కు ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ఒంటిపూట భోజ‌నమే చేస్తార‌ట‌. ఈ నెల రోజుల‌పాటు ప‌వ‌న్ ఇంట్లో పూజ‌లు జ‌రుగుతూనే ఉంటాయ‌ట‌. దీన్నిబ‌ట్టి చూస్తుంటే ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ కి భ‌క్తి ఎక్కువైన‌ట్టు క‌నిపిస్తోంది.