Begin typing your search above and press return to search.
పవన్ పేరుకి ముందు పవర్ స్టార్ ఎలా చేరిందో తెలుసా?
By: Tupaki Desk | 3 Sep 2022 7:47 AM GMTటాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కి ఉన్న క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అలాంటి పవన్ ను ఆయన అభిమానులంతా పవర్ స్టార్ అనే పిలుస్తుంటారు. పవర్ స్టార్ అనగానే పవన్ కల్యాణ్ అనే విషయం తెలియని వాళ్లంటూ ఉండరు. అంతగా ఆ బిరుదు ఆయనకి సెట్ అయింది ... అంతగా ఆ బిరుదు జనంలోకి వెళ్లింది. ఆయన సినిమాల్లో కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనే టైటిల్ కార్డు పడుతుంది. అయితే ఆయనను మొదటిసారిగా పవర్ స్టార్ అని పిలిచింది ఎవరు? ఏ సినిమా నుంచి పవర్ స్టార్ అనేది టైటిల్స్ లో పడుతూ వచ్చిందో తెలుసుకోవాలనే ఆసక్తి ఆయన అభిమానుల్లో ఉంటుంది.
పవన్ మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆయాన ఎప్పుడూ చిరంజీవి స్టైల్ ను అనుకరించలేదు. చిరంజీవి హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేసే ఆలోచన చేయలేదు. తనదైన స్టైల్ ను జనానికి కనెక్ట్ చేయడానికే ఆయన మొదటి నుంచి ప్రయాత్నిస్తూ వచ్చాడు. చాలా తక్కువ సమయంలో ఆయన స్టార్ డమ్ ను సంపాదించుకోవడానికి ఇదే కారణం. సాధారణంగా ఒక హీరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒకటి రెండు హిట్లను వెంట వెంటనే అందుకోవడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా పవన్ ఏకధాటిగా ఏడు హిట్లను సొంతం చేసుకున్నాడు.
ఈ ఏడు సినిమాలు కూడా యూత్ కి ఆయనను చేరువ చేశాయి. ఆయన స్టైల్ కి వాళ్ల నుంచి అపారమైన ఆమోదం లభించింది. పవన్ రెండో సినిమా 'గోకులంలో సీత' సినిమాకి పోసాని సంభాషణలు సమకూర్చాడు.
ఈ సినిమా సక్సెస్ మీట్ లో పోసాని మాట్లాడూతూ పవన్ ను 'పవర్ స్టార్' అంటూ సంభోదించాడు. తాను ఆయనను పవర్ స్టార్ అని ఎందుకు అంటున్నది భవిష్యత్తులో అందరికీ అర్థమవుతుందని అన్నాడు. అప్పట్లో ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఆ రోజు నుంచి 'పవర్ స్టార్' అనే మాట పవన్ ను అభిమానించే వారందరికీ కనెక్ట్ అయిపోయింది. ఆ తరువాత సినిమా 'సుస్వాగతం'లో పవర్ స్టార్ అంటూ టైటిల్ కార్డు పడింది. ఇక అప్పటి నుంచి ఆ బిరుదు మరింత పాప్యులర్ అవుతూ, ఇప్పుడది పవన్ అసలు పేరుగా మారిపోయింది.
అయితే ఒక రేంజ్ లో వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవడం .. ఆ తరువాత కూడా ఆ స్థాయిని కొనసాగిస్తూ వెళ్లడమనేది అంత తేలికైన పనేం కాదు. కానీ పవన్ తనకి వచ్చిన 'పవర్ స్టార్' క్రేజ్ తగినట్టుగా వ్యవహరిస్తూ, ఇప్పటికే అదే జోరును కొనసాగిస్తూ ఉండటం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.