Begin typing your search above and press return to search.
పేమెంట్ ఎక్కువైందనే మెగా ఛాన్స్ మిస్?
By: Tupaki Desk | 17 Oct 2016 9:30 AM GMTనేను అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తేనే డైరెక్షన్ అయినా.. యాక్టింగ్ అయినా.. లేకపోతే చేసే ప్రసక్తే లేదంటూ ఈ మధ్యే అభినేత్రి ప్రమోషన్స్ సందర్భంగా చెప్పాడు ప్రభుదేవా. అయితే డైరెక్షన్.. యాక్టింగ్ కే కాదు ప్రభుదేవా చేత పాట కొరియోగ్రఫీ చేయించుకోవాలన్నా పెద్ద మొత్తంలోనే సమర్పించుకోవాలి. అవతల పక్కన ఉన్నది ఎవరైనా పైసా కూడా తగ్గించుకోవట్లేదట. ఈ అటిట్యూడ్ తోనే ప్రభుదేవా మెగా ఆఫర్ ని మిస్ చేసుకొన్నాడని వినిపిస్తోంది.
మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150లో ఏ అట్రాక్షన్ మిస్ కాకుండా జాగ్రత్త పడ్తోంది మూవీ యూనిట్. అందులో భాగంగానే లారెన్స్ డైరెక్షన్ లో చిరంజీవి- లక్ష్మీరాయ్ మీద స్పెషల్ సాంగ్ తీస్తున్నారు. నిజానికి ఈ సాంగ్ కొరియోగ్రఫీకి ఫస్ట్ ఛాయిస్ లారెన్స్ కాదట. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో స్టెప్స్ విషయంలో కంప్రమైజ్ కావడం ఇష్టం లేని చిరు అదిరిపోయే డ్యాన్స్ లు కంపోజ్ చేయాలని ప్రభుదేవాని అప్రోచ్ అయారట. అయితే తన మూమెంట్స్ కావాలంటే కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనని ప్రభుదేవా డిమాండ్ చేయడంతో వెంటనే నిర్మాతగా వ్యవహారిస్తోన్న రామ్ చరణ్ లారెన్స్ ని కలవడం.. ఏళ్ల తర్వాత చిరు సినిమా చేస్తుండటం.. స్టెప్స్ కంపోజ్ చేసే ఛాన్స్ రావడంతో రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా లారెన్స్ ఓకే అనడం చకచకా జరిగిపోయాయ్.
మెగాఫోన్ పట్టుకోని డైరెక్టర్ గా హిట్స్ కొడుతున్న దగ్గర్నుంచి లారెన్స్ కొరియోగ్రఫీ మీద ఫోకస్ తగ్గించేశాడు. అయితే అక్కడుంది తనకి లిఫ్ట్ ఇచ్చిన అన్నయ్య కావడంతో లారెన్స్ నిమిషం కూడా ఆలోచించకుండా సీన్ లోకి వచ్చేశాడు. కాని ప్రభు కూడా సేమ్ అలా చిరంజీవి చలువతోనే కొరియోగ్రాఫర్ అయినవాడే. పైగా 150 నుండి పిలుపు రాలేదు అంటున్నాడు. మరి ఈ రెమ్యూనరేషన్ గోలేంటి రాజా??
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/