Begin typing your search above and press return to search.
ఈ జాతకాల పిచ్చేంది ప్రియమణీ..
By: Tupaki Desk | 8 Sep 2015 9:57 AM GMTతెలుగు, తమిళ ఇండస్ట్రీల్ని ఐదారేళ్ల పాటు ఓ ఊపు ఊపిన ప్రియమణి.. గత మూడేళ్లుగా అడ్రస్ లేదు. చిన్నా చితకా పాత్రలకు కూడా రెడీ అయినా.. అమ్మడికి అవకాశాలిచ్చేవాళ్లు లేరు. పూర్తిగా ఫేడవుట్, షేపవుట్ అయిపోయిన ప్రియమణిని రెండు ఇండస్ట్రీలూ పక్కనబెట్టేశాయి. దీంతో తన కెరీర్ చరమాంకాన్ని కన్నడ నాట లాగిస్తోంది ప్రియమణి. మన ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో ప్రియమణి ముఖ్య పాత్రలో నటించిన సినిమా అక్కడ విడుదలకు సిద్ధమవుతోంది. ఇంకో రెండు మూడు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఐతే కెరీర్ ముగిసిపోయాక ఏం చేయాలో ప్రియమణికి క్లారిటీ లేకుండా ఏం లేదు. పెళ్లి చేసుకుని సెటిలపోవడానికి ఓ బిగ్ షాట్ ను ఆల్రెడీ చూసుకుంది. ముస్తఫా రాజ్ అనే ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ యజమానితో చాలా ఏళ్ల నుంచే డేటింగ్ చేస్తోంది ప్రియమణి.
ఈ మధ్యే తన ప్రేమాయణం గురించి మీడియాకు లీక్ చేసింది కూడా. ఐతే ముస్తఫా ఏమో పెళ్లి చేసేసుకుందాం అని రెండేళ్ల నుంచే పోరు పెడుతున్నాడట. కానీ ప్రియమణి మాత్రం వాయిదా వేస్తూ వస్తోంది. ఏంటి కారణం అంటే.. జాతకాల పిచ్చేనట. ప్రియమణి ఏ పని చేసినా.. జ్యోతిషుణ్ని కలవడం కామన్. పెళ్లి విషయంలో కూడా జ్యోతిషుడి మాట ప్రకారమే నడుచుకోవాలనుకుంటోంది. తన ఫ్యామిలీకి సన్నిహితుడైన జ్యోతిషుడు కనీసం ఇంకో ఏడాది వరకు పెళ్లి చేసుకోవద్దని కండిషన్ పెట్టాడట. ఐతే ముస్తఫా మాత్రం ఈ జాతకాల్ని కొట్టిపారేసి పెళ్లి చేసుకుందామని అంటున్నాడట. ప్రియమణి మరీ ఇలా పట్టుదలకు పోతే ముస్తఫాకు చిర్రెత్తుకొచ్చినా రావచ్చు. ఎందుకంటే ప్రియమణే ముందు అతడికి ప్రపోజ్ చేసింది. బెంగళూరులో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఇద్దరికీ పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. ముందు ప్రియమణే ప్రపోజ్ చేయగా.. ముస్తఫా నమ్మలేదు. ఆ తర్వాత ప్రియమణి సీరియస్ అని అర్థమై ఓకే చెప్పాడు.