Begin typing your search above and press return to search.
బాహుబలిలో ఉన్నవి ఇందులో లేవు
By: Tupaki Desk | 3 Oct 2015 7:30 PM GMTసౌత్ సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది బాహుబలి. 600 కోట్ల వసూళ్లతో టాప్ 3 ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలాంటి సినిమాని కొట్టే సినిమా ఎప్పుడొస్తుంది? అన్నదానికి ఇప్పట్లో సమాధానం చెప్పడం కష్టం. మళ్లీ బాహుబలి 2 రావాల్సిందే. లేదూ శంకర్ దర్శకత్వంలోని రోబో 2 రావాల్సిందే.
అయితే వీటన్నిటినీ మించి విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో వచ్చిన పులి బాహుబలి మార్క్ ని - స్టాండార్డ్స్ ని టచ్ చేయలేకపోయినా .. ఆ స్థాయిలో క్రేజు తెచ్చుకుంటుందని బాక్సాఫీస్ వద్ద సునాయాసంగా వసూళ్ల వేట సాగిస్తుందని అనుకున్నారు. ముందస్తు ప్రచారం - హైప్ చూసి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దులిపేస్తుందనే అనుకున్నారు. అయితే ఈ సినిమా పై విమర్శకులు పెదవి విరిచేశారు. పరమ రొటీన్ స్ర్కీన్ ప్లే - అందరికీ తెలిసిన కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. ముందు ముందు ఏం జరుగుతుందో ఆడియెన్ తేలిగ్గా గెస్ చేసేసేలా కథాంశం ఉంది. పైగా బాహుబలి రేంజులో వార్ ఎపిసోడ్స్ - సీన్స్ ఈ సినిమాలో లేవు. ఉగ్గబట్టి కుర్చీ అంచుపై కూచుని చూసేంత మెస్మరైజింగ్ వార్ ఎపిసోడ్స్ లేనేలేవు.
ఇవన్నీ పులి చిత్రానికి పెద్ద మైనస్ అవుతాయనే క్రిటిక్స్ చెబుతున్నారు. కథ అనేది లేకపోతే ఎంత అద్బుతమైన గ్రాఫిక్సు ఉన్నా ఒకటే కదా. బాహుబలిలో కూడా భారీ కథ లేదు.. కాని ఆసక్తికర కథనం ఉంది. అదే ఆ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది.