Begin typing your search above and press return to search.
జక్కన్న డేట్ ఎందుకు చెప్పాడంటారు?
By: Tupaki Desk | 24 Oct 2015 7:30 AM GMTబాహుబలి 2 రిలీజ్ డేట్ గురించి తుపాకి.కాం ఇప్పటికే చెప్పేసింది. అయితే అసలు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇలా ఎందుకు చెప్పాల్సొచ్చింది అని. బాహుబలి విషయంలో జక్కన్న అంతా టాప్ సీక్రెట్ గా మెయింటెయిన్ చేశాడు. ఏ విషయాన్నీ బయటకు రానీయలేదు. రిలీజ్ విషయంలో తొందరపడలేదు. అసలు ఏం జరుగుతోందో చిన్న లీక్ కూడా ఇవ్వలేదు. అంతా టాప్ సీక్రెట్. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా.. అంతా ఫైనల్ అయ్యాకే రిలీజ్ చేశాడు.
కానీ బాహుబలి2 విషయంలో రిలీజ్ కు సంబంధించి డేట్ ఫైనల్ చేసుకుని సెట్స్ పైకి వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి చాలానే కారణాలున్నాయి. బాహుబలి తీసినప్పుడంటే అది టాలీవుడ్ కి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. జక్కన్న ఏదో అద్భుతం చూపించబోతున్నాడని తెలుగు జనాలు వరకే మాట్లాడుకున్నారు. కానీ బాహుబలి సృష్టించిన సంచలనాల తర్వాత.. సీన్ మారిపోయింది. బాహుబలి2 ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయిపోయింది. బడ్జెట్ కూడా పెరిగిపోయింది. పెట్టుబడి పెట్టే వాళ్ల నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది. దీంతో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాల్సిందే. అంటే.. స్టార్ట్ చేసేపుడే రిలీజ్ డేట్ లాక్ చేసుకుని సెట్స్ మీదకు వెళ్లాలి. అదీ లెక్క.
అందుకే వచ్చే ఏడాదే రిలీజ్ చేస్తానని జక్కన్న కమిట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అందుకే డిసెంబర్ 10న కానీ, డిసెంబర్ 31న కానీ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మొదటి పార్ట్ షూటింగ్ సమయంలోనే.. సీక్వెల్ లో యాక్టర్స్ షూటింగ్ పార్ట్ లో మేజర్ భాగం కంప్లీట్ అయింది. గ్రాఫికల్ వర్క్స్ కోసం ఎక్కువ టైం కేటాయించాలిపుడు. అంతే. మొత్తానికి వచ్చే ఏడాది బాహుబలి పార్ట్ 2 స్క్రీన్స్ పైకి వచ్చేయడమైతే ఖాయం.