Begin typing your search above and press return to search.
బాషా సినిమా అలా పుట్టింది..
By: Tupaki Desk | 6 Jan 2017 7:30 PM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లోనే కాదు.. దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే ఓ మైలురాయి లాంటి సినిమా ‘బాషా’. సౌత్ సినిమాపై ‘బాషా’ ప్రభావం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘బాషా’ స్ఫూర్తితో తర్వాత పదుల సంఖ్యలో సినిమాలొచ్చాయి. అప్పటిదాకా తమిళం వరకే సూపర్ స్టార్ అయిన రజినీ.. ‘బాషా’ సినిమాతో సౌత్ మొత్తానికి సూపర్ స్టార్ అయ్యాడు. ఇంతటి ప్రభావం చూపించిన సినిమాకు ఎలా బీజం పడిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
రజినీకాంత్ ఒకప్పుడు కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించాడు. అందులో ఒకటి.. హమ్. అందులో అమితాబ్ బచ్చన్ - గోవిందాలతో కలిసి నటించాడు రజినీ. ఆ సినిమాకు ముకుల్ ఎస్.ఆనంద్ దర్శకుడు. ఆ సినిమాలో అమితాబ్ మాజీ డాన్. తన పాత జీవితాన్ని పూర్తిగా మర్చిపోయి.. ఒక సాదాసీదా మనిషిగా తన ఇద్దరు తమ్ముళ్లతో బతుకుతూ ఉంటాడు. ఐతే ద్వితీయార్ధంలో విలన్లు తనను కెలికేసరికి మళ్లీ పాత అవతారంలోకి మారుతాడు. ఈ సినిమా కోసమని ముకుల్ ముందు ఓ సీన్ రాసుకున్నాడు. తన తమ్ముడైన గోవిందాకు కాలేజీలో సీటు రాకపోతే అమితాబ్ ఆ కాలేజీకి వెళ్లి తన పేరు చెప్పి.. కానీ నాకు ఇంకో పేరుందంటూ అది చెప్పేసరికి కాలేజీ యజమాని హడలిపోయి సీటు ఇచ్చేస్తాడు. ఐతే ఈ సీన్ గురించి రజినీతో సరదాగా చెప్పాడట దర్శకుడు ముకుల్. ఆ సన్నివేశం రజినీకి బాగా నచ్చింది. కానీ ఆ సినిమా కోసం ఆ సన్నివేశం తీయలేదట.
కానీ రజినీ మాత్రం ఆ సన్నివేశాన్ని గుర్తుపెట్టుకుని దర్శకుడు సురేష్ కృష్ణకు చెప్పి.. కొంచెం ‘హమ్’ కథను కూడా పోలి ఉండేలా స్టోరీ రెడీ చేయమన్నాడట. అలా ‘బాషా’ కథ పుట్టింది. ‘బాషా’ సినిమాలో నా పేరు మాణిక్యం అని చెబుతూ.. నాకు ఇంకో పేరుందంటూ రజినీ తన మరో రూపాన్ని గుర్తు చేసే సీన్ ఎంత బాగా పండిందో తెలిసిందే. మొత్తానికి తనకు నచ్చిన సన్నివేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని సినిమా చేసి.. తన కెరీర్ ను గొప్ప మలుపు తిప్పుకున్నాడు రజినీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/