Begin typing your search above and press return to search.

బడ్జెట్‌ లో భాగంగా రకుల్‌ కొట్టేసింది

By:  Tupaki Desk   |   8 July 2016 8:17 AM GMT
బడ్జెట్‌ లో భాగంగా రకుల్‌ కొట్టేసింది
X
మహేష్‌ బాబు సినిమాకు ఏకంగా 100 కోట్లు బడ్జెట్. ఈ హెడ్ లైన్ వినడానికి చాలా బాగుంటుంది. మావాడి సినిమా వంద కోట్లెట్టి తీసేత్తన్నార్రా అంటూ ఫ్యాన్స్ చెప్పుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. అయితే సినిమాను తీసే మహేష్‌ బాబుకు తెలుసు.. డబ్బులు పెట్టిన నిర్మాతలకు తెలుసు.. సినిమా పంపిణీ చేస్తున్న డిస్ర్టిబ్యూటర్లకు తెలుసు.. అది పులి మీద సవారిలా ఉంటుందని. అందుకే బడ్జెట్‌ బాదుడిని బాగా కట్ చేయాలని డిసైడయ్యాడు మన హీరో. అదిగో.. అందులో భాగంగా ఇప్పుడు రకుల్‌ చేతిలో సూపర్ ఆఫర్ వచ్చిపడింది.

నిజానికి బ్రహ్మోత్సవం విషయంలో అప్సెట్‌ అయిన మహేష్‌.. ముఖ్యంగా వర్రీ అయ్యేది ఆ 35 కోట్ల లాస్‌ గురించే. 70 కోట్లకు అమ్ముడపోయిన సినిమాకు.. బాక్సాఫీస్‌ నుండి 35+ కోట్లు మాత్రమే రావడంతో.. ఇప్పుడు మురుగుదాస్‌ సినిమాకు 100 కోట్లు పెట్టి ప్రయోగం చేయకూడదని ఫిక్సయ్యాడు. గతంలో ఎలాగైతే కంట్రోల్డ్ బడ్జెట్‌ లో శ్రీమంతుడు సినిమాను చేశాడో.. మళ్ళీ సేమ్ అదే ఫార్ములాను ప్రయోగించాడు. ఆ దెబ్బకి 3.5 కోట్ల రూపాయలతో హీరోయిన్ గా తెలుగు తెరపై వెలగాల్సిన పరిణీతి చోప్రాను తప్పించి.. 1 కోటి రూపాయల బడ్జెట్‌ లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను తీసుకోవాల్సి వచ్చింది.

గతంలో బ్రహ్మోత్సవం సినిమాలోనే మహేష్‌ బాబుతో జతకట్టాల్సిన రకుల్‌.. అప్పుడు డేట్లు లేకపోవడంతో సైడ్ అయిపోయింది. ఇప్పుడు కాలం కలిసొచ్చి బడ్జెట్ కారణంగా ఈమెకు పిలుపు రావడంతో.. ఎలాగైనా డేట్లు సర్దేస్తోందట. అది సంగతి.