Begin typing your search above and press return to search.
బన్నీకి చోటిచ్చాడా? రజనీకి భయపడ్డాడా?
By: Tupaki Desk | 2 Nov 2017 1:30 AM GMTరామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం 1985. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ చేసుకోగా.. ప్రస్తుతం హైద్రాబాద్ లోనే ఓ కొండపై రంగస్థలం ఊరి సెట్ వేసి షూటింగ్ ను కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా సినిమా షూటింగ్ లో చెప్పుకోవాల్సిన స్థాయిలో పని పెండింగ్ ఉంది. అందుకే రిలీజ్ డేట్ విషయంలో తొందరపడ్డం లేదు.
మొదట సంక్రాంతికి రిలీజ్ అనుకున్న మూవీ.. ఆ తర్వాత సమ్మర్ కి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 13న రామ్ చరణ్ రంగస్థలం రిలీజ్ అవుతుందని కొంత సమాచారం లీక్ అయింది. అయితే.. ఏప్రిల్ 27న అల్లు అర్జున్ మూవీ నా పేరు శివ విడుదల చేయాలని ముందే డిసైడ్ చేశారు. దీంతోపాటు ఇదే డేట్ కు మహేష్ నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం కూడా రేసులో నిలిచింది. అంటే.. ఎలా చూసుకున్నా.. రెండు వారాల్లో దాదాపుగా థియేటర్లను ఖాళీ చేయాల్సి వస్తుంది.
ఇదే సమస్య అనుకుంటే.. ఇప్పుడు రజినీకాంత్ రూపంలో మరో ప్రమాదం తరుముకొచ్చేసింది. జనవరి చివరలో విడుదల కావాల్సిన 2.ఓ మూవీని.. తమిళ్ న్యూ ఇయర్ అంటూ తెచ్చి ఏప్రిల్ 13న వేశారు. దీంతో చెర్రీ పరిస్థితి గందరగోళంలో పడింది. రజినీకాంత్ సినిమాను మన దగ్గర స్టార్ హీరోల సినిమాలతో సమానంగా రిలీజ్ చేస్తారు. పైగా ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ కోసమే 81 కోట్లు పెట్టారనే న్యూస్ ఉంది. సో.. ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి ఛాన్స్ లేదు.
దీంతో రామ్ చరణ్ రంగస్థలంను మార్చ్ 29కే విడుదల చేయాలని డిసైడ్ చేశారు. అంటే సమ్మర్ సీజన్ ను స్టార్ట్ చేయబోయేది చెర్రీనే అన్నమాట. అయితే.. రజినీకాంత్ కు భయపడి.. చరణ్ తప్పుకోవడమేంటి అని కొంత మంది ఫ్యాన్స్ గట్టిగానే ఫీలవుతున్నారు. కానీ సీనియర్ హీరోకు గౌరవం ఇవ్వడం వేరు.. భయపడ్డం వేరు అని సర్దిచెబుతున్నాడట చరణ్. పైగా ఇలా చేయడం కారణంగా.. బన్నీ మూవీకి ఒక నెల గ్యాప్ దొరుకుతుంది. మొత్తం మీద కారణాలు ఏవైనా చరణ్ తీసుకున్న డెసిషన్ మాత్రం సూపర్ అంటున్నారు ట్రేడ్ జనాలు.