Begin typing your search above and press return to search.
రామ్ చరణ్ భయపడ్డాడా?!
By: Tupaki Desk | 31 Dec 2015 4:32 AM GMTఎవరేమన్నా బాక్సాఫీసు పాలిట ఓ ఆకర్షణ మంత్రం చిరంజీవి. ఆయన సినిమా అంటే మాస్ జనం థియేటర్లకి కదిలొచ్చి కదం తొక్కుతుంది. సినిమాకి దూరమై ఎనిమిదేళ్లవుతున్నా ఇప్పటికీ నెంబర్ వన్ కథానాయకుడు అనిపించుకొనే స్టామినా ఆయనలో కనిపిస్తోంది. అందుకే చిరు రీ ఎంట్రీ గురించి అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలో అంతటి క్రేజ్ కనిపిస్తోంది. ఆ క్రేజ్‌ని చూసే రామ్ చరణ్ డాడీ 150వ సినిమాకి తానే నిర్మాత అని కర్చీఫ్ వేసేశాడు. కానీ తన డాడీ రీ ఎంట్రీ సినిమా విషయంలో మొదట్లో కనిపించినంత ఉత్సాహం చరణ్ లో ఇప్పుడు కనిపించడం లేదని తెలుస్తోంది. అందుకు బ్రూస్ లీ ఫలితమే కారణమని పరిశ్రమ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి.
బ్రూస్ లీ సినిమాతోనే చిరు రీ ఎంట్రీ ఇచ్చేశారు. చిరు కోసమైనా ఆ సినిమాని జనాలు చూసేస్తారని ఆశించారంతా. చరణ్ లోనూ అదే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ సినిమా నచ్చకపోవడంతో చిరు ఉన్నప్పటికీ ఆ సినిమాని చూడలేదు జనాలు. దాంతో చరణ్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. డాడీ 150వ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ ఫలితం ఏమాత్రం తేడాగా వచ్చినా నష్టం పెద్ద ఎత్తున ఉంటుంది కదా అని తన సన్నిహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ చర్చలు జరిపాడట. అందుకే ఆ సినిమాని సొంతంగా నిర్మించే సాహసం చేయడం కంటే మరొక నిర్మాతని కూడా కలుపుకొని సేఫ్ గేమ్ ఆడటమే మేలన్న నిర్ణయానికి చరణ్ వచ్చేశాడని సమాచారం. అందులో భాగంగా శ్రీలంకకి చెందిన లైకా ప్రొడక్షన్స్ తో చర్చలు జరిపి ఆ సంస్థని కూడా నిర్మాణ భాగస్వామిగా మార్చుకొన్నట్టు తెలిసింది. నిర్మాణ వ్యవహారాలన్నింటినీ చరణ్ చూసుకొనేలా... పెట్టుబడంతా లైకా ప్రొడక్షన్ పెట్టేలా ఒప్పందం కుదిరినట్టు సమాచారం.