Begin typing your search above and press return to search.
వేధింపుల వలనే నేను రావట్లేదు -రష్మి
By: Tupaki Desk | 8 Feb 2018 3:38 AM GMTచిట్టి పొట్టి బట్టలతో అందాలను ఆరబోస్తూ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది రష్మి. అంత అందాల ఆరబోత చేసేది సినిమా ఛాన్సుల కోసమే. మొత్తమ్మీద సినిమా అవకాశాలు దక్కించుకుంది. కానీ ఆమె ఫేస్ బుక్ లైవ్ చాట్ లోకి రావడం మానేసింది.
ఒరిస్సాకు చెందిన వైజాగ్ పిల్ల రష్మి. పుట్టింది పెరిగింది అక్కడే అయినా... తెలుగు మాత్రం సరిగా నేర్చుకోలేకపోయింది. గుంటూర్ టాకీస్ చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఆ తరువాత అంతం - తను వచ్చెనంట - నెక్స్ట్ నువ్వే చిత్రాలు చేసింది. అయినా సినిమాలలో పెద్ద పేరు రాలేదు. అవకాశాలు మాత్రం అడపాదడపా వస్తూనే ఉన్నాయి. కాగా అప్పుడప్పుడు తన అభిమానులను పలకరించడం కోసం ఫేస్ బుక్ లైవ్ చాట్ లోకి వస్తుండేది. అక్కడ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేది. కానీ చాలా రోజులుగా మాత్రం లైవ్ ఛాట్ లోకి రాలేదు. దీంతో ఓ అభిమాని ట్విట్టర్ లో ఆమెను ఇదే విషయం అడిగాడు. దానికి ఆమె తన మనసులో మాట చెప్పేసింది.
''మానసికంగా లైంగిక వేధింపులను కోరి కొని తెచ్చుకోవడం ఎందుకు? అందుకే రావట్లేదు'' అంటూ చెప్పింది ఈ సుందరి. లైవ్ ఛాట్ లో వచ్చే కొన్ని అసభ్య పదజాలంతో తాను విసిగిపోయానని అందుకే లైవ్ చాట్ లోకి రావడం లేదని చెప్పింది. గతంలో ఆమె లైవ్ చాట్ లోకి వచ్చినప్పుడు.. కొందరు లైంగిక పదజాలంతో బాధపెట్టారని తెలుస్తోంది. ఆమె డ్రెస్సింగ్ పై కూడా కామెంట్లు చేశారని, ఆ మాటలు భరించలేకే లైవ్ ఛాట్ ఆపేసిందట రష్మి.