Begin typing your search above and press return to search.
హ్యాండిచ్చినందుకు రీజన్ చెప్పిన యాంకర్
By: Tupaki Desk | 7 July 2016 5:18 AM GMTహాట్ యాంకర్ రష్మీ నటించిన అంతం మూవీ రిలీజ్ ఇవాళే. గత నెలలో రిలీజ్ డేట్ ని ఇచ్చి.. ప్రమోషన్ పనులను యూనిట్ వర్గాలు బాగానే హ్యాండిల్ చేశాయి. రష్మీ గౌతమ్ నే పాయింట్ చేసి.. పబ్లిసిటీ యాక్టివిటీస్ చేపట్టారు. ఇదంతా గుంటూరు టాకీస్ మూవీ విషంలో.. ఈ హాటీ చేసిన మాయ అనే విషయం అర్ధం చేసుకోవచ్చు. అయితే అంతం ప్రమోషన్స్ లో మాత్రం అసలు ఈ భామ ఎక్కడా కనిపించలేదు. ఇలా హ్యాండ్ ఇవ్వడానికి రీజన్ ఉందని చెబుతోంది రష్మీ.
'దర్శకుడు కళ్యాణ్ ఈ సినిమాని కేవలం 7 రోజుల్లో ఫినిష్ చేస్తానని చెప్పాడు. కంటెంట్ బాగుందని.. కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశ్యంతో ఒప్పుకున్నాను. ఫస్ట్ లుక్.. రిలీజ్ డేట్ లను నాకు ముందుగా చెప్పనే లేదు' అంటోంది రష్మీ. అసలు సమస్య ఇక్కడే మొదలు కాగా.. తననే ఫోకస్ చేస్తూ ప్రమోషన్స్ చేయడం ఈ హాట్ యాంకర్ కి నచ్చలేదని డైరక్టుగానే చెప్పింది. మూవీలో కంటెంట్ ఉన్నా.. తన అందాలనే చూపిస్తూ పబ్లిసిటీ చేయడం.. ఓ పాటకి సంబంధించిన క్లిప్పింగులతోనే ప్రచారం చేయాలని చూడడం నచ్చలేదట. ఆడియన్స్ ను అలా మిస్ లీడ్ చేయడం ఎందుకు అంటోంది.
మొదట ఈ సినిమాకి వ్యూహం అనే టైటిల్ ని అనుకున్నారు. ఆ తర్వాత అంతంగా మార్చి రిలీజ్ చేస్తున్నారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలైన ఈ మూవీకి.. గుంటూరు టాకీస్ సక్సెస్ కారణంగా ప్రాణం వచ్చిందని చెప్పాలి. అయితే.. లీడ్ కేరక్టర్స్ అయిన చరణ్ దీప్.. రష్మీలు కూడా ప్రచారం చేసి ఉంటే మరింతగా హైప్ క్రియేట్ అయ్యేదనే టాక్ వినిపిస్తోంది.