Begin typing your search above and press return to search.
మేనల్లుడి మెగా టూర్ వెనక సీక్రెట్
By: Tupaki Desk | 8 Dec 2019 5:30 AM GMTసాయి తేజ్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన `ప్రతి రోజూ పండగే` డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో ప్రచారంలో వేగం పెంచిన టీమ్ సోషల్ మీడియాల్లోనూ అంతే స్పీడ్ చూపిస్తోంది. ఈసారి సామాధరమ్ రెట్టించిన జోష్ తో నేరుగా అభిమానుల చెంతకు వెళుతున్నాడు. ముఖ్యంగా ఏపీ మొత్తం చుట్టేస్తున్నాడు. హీరో- డైరెక్టర్ జోడీ రోడ్ షోలో భాగంగా విశాఖలో బయలుదేరి గాజువాక- అనకాపల్లి- నక్కపల్లి- పాయకరావు పేట- అన్నవరం మీదుగా కాకినాడకు చేరుకున్నారు. స్మార్ట్ సిటీలైన విశాఖ- కాకినాడల్లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.
మెగా మేనల్లుడు సాయి తేజ్ కి అన్నిచోట్లా అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. బాణసంచా పేల్చి మెగా నినాదాలతో హోరెత్తించారు. అటుపై కాకినాడ నుంచి రామంద్రపురం మీదుగా మండపేట.. రావులపాలెం -తణుకు- ఏలూరుని కవర్ చేసి నిన్న రాత్రి విజయవాడకు చేరుకున్నారు. ఆదివారం ఈ యాత్రను కొనసాగించనున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఈ ప్రయత్నం బాక్సాఫీస్ రిజల్ట్ కి ఎంత వరకూ కలిసొస్తుంది? తేజు గతంలో ఎప్పుడూ ఇలా రోడ్ షోలు నిర్వహించింది లేదు. మరి ఉన్నట్లుండి ఈ నిర్ణయం వెనుక కారణాలేవైనా ఉన్నాయా? అన్న ముచ్చటా సాగుతోంది.
అయితే తేజూకి సక్సెస్ ముఖం చాటేస్తున్న నేపథ్యంలోనే ఇలా కొత్త ప్లాన్ వేశాడా.. గత సినిమా `చిత్రలహరి`తో కొంత ఉపశమనం దొరకింది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితిలో హిట్టు కొట్టడమే ధ్యేయంగా ఇలా ప్లాన్ చేస్తున్నాడా? అన్నది తనే చెప్పాలి. ఇప్పటివరకూ 12 సినిమాల్లో నటించాడు. పిల్లా నువ్వు లేని జీవితం చక్కని విజయం సాధించగా.. సుప్రీమ్- సుబ్రమణ్యం ఫర్ సేల్ యావరేజ్ గా ఆడాయి. మిగతావన్నీ పరాజయాలే. ఈ నేపథ్యంలో తేజు మార్కెట్ పై ఆ ప్రభావం పడిందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. `చిత్రలహరి`తో అంతో ఇంతో పుంజుకున్నా మార్కెట్ మెరుగు పడటం అనేది ఒక్కసినిమాతో జరిగే పని కాదు. అందుకే ఇలా సరికొత్త ప్రచారానికి తెరలేపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి తేజు ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.