Begin typing your search above and press return to search.

ఆ కాస్ట్యూమ్ సంగతేంటి సాయి?

By:  Tupaki Desk   |   5 Dec 2017 12:27 PM GMT
ఆ కాస్ట్యూమ్ సంగతేంటి సాయి?
X
స్టార్ హీరోలు వ్యవహరించే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. వారు ఎవ్వరికి తెలియకుండా ఫాలో అవుతారో లేక అనుకోకుండా ఒక స్టైల్ ని మెయింటైన్ చేస్తారో గాని మొత్తానికి జనాల్లో మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఒక మెగా హీరో కూడా అదే తరహాలో డ్రెస్సింగ్ స్టైల్ లో అందరిని ఆకట్టుకుంటూ అనుమానాలను రేపుతున్నాడు. అతను ఎవరో కాదు మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్.

ఈ హీరో రీసెంట్ గా జవాన్ సినిమాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా రిజల్ట్ ని పక్కబెడితే ఈ సుప్రీమ్ హీరో ఈ మధ్య బయటకు వస్తే ఒకే స్టైల్ కాస్త్యుమ్స్ తో దర్శనం ఇస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా కుర్తా అండ్ ప్లెయిన్ ప్యాంట్ తోనే వెళుతున్నాడు. గత వారం జవాన్ ప్రమోషన్స్ గురించి ఇదే కాస్ట్యూమ్ ని సెట్ చేసుకున్నాడు. ఇంటర్వ్యూలకు కూడా అదే తరహాలో వచ్చాడు. పోనీ సినిమాలో ఆ లుక్ లో ఉన్నాడు ప్రమోషన్స్ కోసం అనుకున్నా. సినిమాలో అసలు అలాంటి డ్రెస్సుల్లో కనిపించలేదు.

అయితే కొన్ని రూమర్స్ మాత్రం బాగా వస్తున్నాయి. సాయి చిన్న మామయ్య జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎక్కువగా బయటకి వచ్చినపుడు ఇలాంటి దుస్తుల్లోనే కనిపిస్తున్నారు. బహుశా ఆ ప్రభావమా? ఇక రామ్ చరణ్ కూడా ఎక్కువగా ఇదే స్టైల్ లో దర్శనం ఇస్తున్నాడు. లేకుంటే మెగా ఫ్యామిలీ ఇలా కనిపించాలని ఏమైనా ప్లాన్ వేసుకుందా? అనే టాక్ కూడా బాగావినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని క్యాజువల్ గా వేశాడు అని అయితే ఎవరు గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఎదో మ్యాటర్ ఉండే ఉంటుంది..