Begin typing your search above and press return to search.
కొత్త హీరోయిన్.. స్టార్ హీరోకి నో
By: Tupaki Desk | 20 July 2016 5:17 AM GMTమలయాళ మూవీ ప్రేమమ్ లో మలార్ పాత్ర ద్వారా సాయి పల్లవి విపరీతమైన ఫేమ్ సంపాదించేసింది. వరుసపెట్టి సినిమా ఆఫర్లు క్యూ కట్టేశాయి. దాదాపు సౌత్ లోని అన్ని భాషల నుంచి ఈమెకు సినిమా ఛాన్సులు వస్తున్నాయి. పెద్ద దర్శకులు.. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వస్తున్నా సాయి పల్లవి మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలా ఈ మలయాళీ ముద్దుగుమ్మను నటించాల్సిందిగా అడిగారు. అయితే.. ఈమె మొత్తం స్టోరీ అంతా విన్నాక తన పాత్రకు ప్రాధాన్యం లేదు కాబట్టి.. చేయనని తేల్చేసింది. అజిత్ లాంటి హీరో సరసన ఛాన్స్ వస్తే.. కెరీర్ స్టార్టింగ్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ వద్దనడం షాకింగ్ గా మారింది. గతంలో కూడా ఇలాగే మణిరత్నం దర్శకత్వంలో కార్తి సినిమాని కూడా కాదనుకుంది సాయి పల్లవి. మణిరత్నం మూవీలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని అందుకే ఈ ఛాన్స్ ను వద్దను చెప్పిందనే టాక్ వినిపిస్తున్నా.. దీనికి అసలు కారణం ఓసారి తనే చెప్పింది సాయి పల్లవి.
డాక్టర్ కోర్స్ చదువుతున్న తనకు కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయని.. అందుకే మణిరత్నం సినిమా చేయలేకపోతున్నానని సాయి పల్లవి చెప్పింది. అప్పుడు రీజన్ సరిగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం అజిత్ సినిమాకు నో చెప్పడంతో ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇలా అయితే కెరీర్ పట్టాలెక్కేదెలా అనుకుంటున్నారు.