Begin typing your search above and press return to search.
సమంత అందుకే ఒప్పుకుందా?!
By: Tupaki Desk | 1 Aug 2015 5:53 PM GMTచిన్న సినిమాల్లో నటిస్తాన హో... అని అప్పుడెప్పుడో ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసింది సమంత. తమిళంలో వరుసబెట్టి చిన్న సినిమాలు సక్సెస్ అవుతుండడం చూసి అప్పట్లో సమంత వాటిపై మనసు పారేసుకొందన్నమాట. అయితే సమంత స్టేట్ మెంట్ ఇచ్చింది కదా అని ఆమెతో సినిమాలు తీసేందుకు ఎవ్వరూ ఉత్సాహం చూపలేదు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ తో సినిమా అంటే ఆషామాషీనా? ఎంత లేదన్నా కోటికి తగ్గకుండా అడుగుతుంది. చిన్న సినిమాలంటే కోటి, రెండు కోట్ల బడ్జెట్ లోనే పూర్తవ్వాలి. అలాంటప్పుడు సమంతకొక్కటే కోటి ఎలా ఇస్తారు. అందుకే ఆమె స్టేట్ మెంట్ ని అంతా లైట్ గా తీసుకొన్నారు. దీంతో సమంత అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ యథావిధిగా పెద్ద సినిమాలే చేసుకొంటూ వచ్చింది. అయితే ఇటీవల సమంత ఓ చిన్న సినిమాకి ఓకే చెప్పేసింది.
జి.వి.ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా ప్రశాంత్ అనే దర్శకుడు `బ్రూస్ లీ` పేరుతో తమిళంలో ఓ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఆ సినిమాలో కథానాయికగా సమంత నటించనున్నట్టు తెలుస్తోంది. అక్కడ విజయ్, విక్రమ్, సూర్య లాంటి స్టార్ హీరోలతో కలిసి నటిస్తున్న సమంత జీవీ ప్రకాష్ కుమార్ లాంటి హీరో పక్కన నటించేందుకు ఒప్పుకోవడమేంటి? అని తమిళ సినీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కానీ సమంత ఆ సినిమా ఒప్పుకోవడం వెనక బలమైన కారణమే ఉందట. భారీగా రెమ్యునరేషన్ ముట్టజెబుతుండటంతోనే సమంత ఆ సినిమాకి ఓకే చెప్పేసిందట. దాదాపు కోటిన్నర సమంత అందుకుంటుందని సమాచారం. పైగా తక్కువ రోజులు కాల్షీట్లు కేటాయిస్తే చాలట. అందుకే సమంత మరో మాట లేకుండా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. కానీ సమంత మాత్రం అందరికీ కథ నచ్చింది, అందుకే ఒప్పుకొన్నా అని చెబుతోంది. మొత్తంగా అటు పెద్ద సినిమాలు, ఇటు చిన్న సినిమాలు వరుసబెట్టి కొట్టేస్తోంది సమంత.