Begin typing your search above and press return to search.
సమంత తెలివే అక్కినేనీస్ కు నచ్చిందా?
By: Tupaki Desk | 5 May 2017 12:53 PM GMTఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక డస్కీ పిల్ల.. రంగురంగుల ఫిలిం ఇండస్ర్టీలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ఏకంగా సినిమాలే శ్వాసగా జీవిస్తున్న ఒక అతిపెద్ద తెలుగు ఫిలిం ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెడుతోంది. అయితే ఇదంతా కేవలం ఆమె నాగ చైతన్యకు బాగా నచ్చే సింది కాబట్టే జరిగిందా అంటే అవుననే చెప్పాలి. కాకపోతే అక్కినేని ఫ్యామిలీని ఇంప్రెస్ చేసిన మరో విషయం కూడా ఉందట.
సింపుల్ లేడీ అయిన సమంత.. స్కూల్లో ఉన్నప్పుడు చదువులో దిట్ట. ఎకనామిక్స్ లో గోల్డ్ మెడల్ ను 10వ తరగతిలో జస్ట్ మిస్సయ్యిందట. ఆ తరువాత కూడా డిగ్రీలో మార్కులన్నీ డిస్టింక్షనే. అందుకే తను సంపాదించే డబ్బులను బాగా ఇన్వెస్ట్ చేయడం దగ్గర నుండి.. ఒక చారిటీ ఆర్గనైజేషన్ నడపడం వరకు.. సమంత అనేకం చక్కగా చూసుకుంటోంది. అంతెందుకు.. ఈ మధ్యనే తన పుట్టినరోజు జరుపుకున్న సమంత.. పార్టీని ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్ళో కూడా ఇవ్వొచ్చు. కాని లక్షల్లో ఖర్చుపెట్టాలి. అందుకే సమంత చక్కగా ఇంటి దగ్గరే తన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేసింది. అలాగే ఫ్యామిలీ హోటల్ అయిన ఎన్-గ్రిల్ లో చిన్న ట్రీట్ ఇచ్చింది.
ఈ విధమైన సేవింగ్స్ మైండ్ సెట్ చూస్తే నాగ్ కు తెగ నచ్చేసిందట. అందుకే సమంతను చేసుకోవడానికి ఆయన మారు మాట్లాడకుండా ఎన్నడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అంటున్నారు. ఆల్రెడీ సమంత-చైతన్యల ఎంగేజ్మెంట్ అయిపోగా.. త్వరలోనే ఈ జంట వేద మంత్రాల సాక్షిగా.. చర్చిలో హైమ్న్స్ సాక్షిగా జరగనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/