Begin typing your search above and press return to search.

మనసులో మాట చెప్పేసిన సమంత!!

By:  Tupaki Desk   |   16 July 2016 12:37 PM GMT
మనసులో మాట చెప్పేసిన సమంత!!
X
సమంత ఇప్పుడు ఖాళీగానే ఉంది. చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. జనతా గ్యారేజ్ లో ఒక పాట మినహాయిస్తే.. ఇంకో ప్రాజెక్టుకు సైన్ చేయడం లేదని ముందే చెప్పేసుకున్నాం. కొత్త సినిమాలు యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం.. నిశ్చితార్ధం, పెళ్లి అనే న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి.

మరి నువ్వెందుకు కొత్త సినిమా చేయడం లేదు సమంతా? అని సమంతనే అడిగితే సరిపోతుందని అనుకున్నాడో ఫ్యాన్. అందుకే ఎంచక్కా.. ట్విట్టర్ లో అదే ప్రశ్న వేశాడు సమంతకి. అభిమానులు అడగడం విషయం కాదు కానీ.. స్టార్లు రియాక్ట్ అవడమే అసలు పాయింట్. 'ఎందుకు కొత్త సినిమా సైన్ చేయడం లేదంటే.. నా తర్వాతి సినిమా.. తెరి కంటే.. 24 కంటే.. అ.ఆ.. కంటే ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నా. కానీ అలాంటి సబ్జెక్ట్ దొరకడం చాలా కష్టంగా ఉంది' అంటూ ఆన్సర్ ఇచ్చింది సమంత.

శామ్స్ నుంచి రియాక్షనే ఊహించనపుడు.. ఇలాంటి సమాధానం అసలు ఎక్స్ పెక్ట్ చేయలేం. పైగా ఈ మధ్య నిశ్చితార్ధం కబుర్లు బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయ్. మరోవైపు యు టర్న్ మూవీ చేసేందుకు సమంత రెడీ అవుతోందని తెలుస్తోంది. తెలుగు - హిందీ భాషల్లో తీసేసి.. మరో రెండు సౌత్ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని సమంత అనుకుంటోందట. రీజన్ ఏదైనా.. రూమర్స్ కు సమంత కొన్నాళ్లు చెక్ పెట్టిందంతే.