Begin typing your search above and press return to search.

'షకలక' కట్ చేసుకోవడం ఎందుకో

By:  Tupaki Desk   |   13 Feb 2018 9:54 AM IST
షకలక కట్ చేసుకోవడం ఎందుకో
X
జీవితంలో పేరు తెచ్చుకోవడం ముఖ్యం కానీ.. ఏ పేరయితే మాత్రం ఏమవుతుంది అని చాలామంది అనుకోవచ్చు. సెంటిమెంట్ ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చే సినిమా ఇండస్ర్టీలో జనాలు మాత్రం అస్సలు అలా అనుకోరు. కలిసొచ్చే పేరు పెట్టుకుంటే అదృష్టం వెతుక్కుంటూ.. హిట్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందని చాలామందే నమ్ముతుంటారు.

ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడం కోసం చాలామంది పేర్లు మార్చుకున్నారు. కొత్త కొత్త పేర్లు.. బిరుదులు ఎక్కడెక్కడి నుంచే వెతుక్కుని మరీ తెచ్చుకుని పెట్టుకుంటారు. కానీ గుర్తింపు తెచ్చిన పేరు వదిలేసుకోవడం ద్వారా పాపులారిటీ తెచ్చుకోవచ్చని కొత్తగా ఆలోచిస్తున్నాడు లేటెస్ట్ గా హీరోగా మారిన ఓ కామెడీ యాక్టర్. శంకర్ అంటే చాలామంది తెలియదనే అంటారు. అదే షకలక శంకర్ అంటే తెలుగువాళ్లలో తెలియనివాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. కొత్తగా శంభోశంకర సినిమాతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కానీ ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లలో ‘షకలక’ కట్ చేసి కేవలం శంకర్ మాత్రమే ఉంచారు.

ఆకాశమంత ఇమేజ్ తెచ్చిపెట్టిన షకలక పేరు వదిలేసుకుని ఉత్త శంకర్ తో ప్రేక్షకుల్లోకి వెళ్లడం ఎందుకని ఆరా తీస్తే ఎవరో బాబా చెప్పాడని అతడు ఇలా చేస్తున్నాడని తెలుస్తోంది. షకలక శంకర్ గా ఉంటే కమెడియన్ గా ఉంటావని.. అందులో షకలక వదిలేస్తే స్టార్ హీరో అయిపోతావనే చెప్పడంతో ఇలా ట్రై చేస్తున్నాడట. వచ్చే పేరు కోసం ఉన్న పేరు వదిలేసుకోవడం అంత అవసరమంటావా శంకరూ...