Begin typing your search above and press return to search.

శర్వా గాయం - క్లాసిక్ రీమేక్ ఆలస్యం

By:  Tupaki Desk   |   18 Jun 2019 7:25 AM GMT
శర్వా గాయం - క్లాసిక్ రీమేక్ ఆలస్యం
X
గత ఏడాది తమిళ్ లో ఊహించని స్థాయిలో ఘన విజయం సొంతం చేసుకున్న 96 తెలుగు రీమేక్ కు అవాంతరాల బెడద ఎప్పుడు తొలగుతుందో అర్థం కావడం లేదు. దిల్ రాజు ఎంతో మోజుపడి హక్కులు కొనుక్కుని మంచి కాంబినేషన్ ను సెట్ చేసుకునే సమయానికి హీరో శర్వానంద్ థాయిలాండ్ లో స్కై డైవింగ్ చేస్తూ గాయపడటం పెద్ద చిక్కులే తెచ్చి పెట్టింది. డాక్టర్లు అఫీషియల్ గా రెండు నెలల రెస్ట్ రికమండ్ చేశారు. ఎంత లేదన్నా రిస్క్ తీసుకోకుండా ఇంకో నెల అదనంగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

మరోపక్క సమంతాతో సహా ఇతర ఆర్టిస్టుల డేట్స్ తీసుకుని దర్శకుడు ప్రేమ కుమార్ తో దిల్ రాజు అన్ని పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్ చేసి పెట్టారు. తీరా ఇప్పుడు చూస్తే మొత్తం మార్చేయల్సిన పరిస్థితి వచ్చింది. శర్వా పూర్తిగా కోలుకున్నాకే మొదలుపెట్టాలి. సినిమా కన్నా హీరో క్షేమం ముఖ్యం కాబట్టి శర్వా ఎప్పుడు రెడీ అవుతాడు అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని సమాధానం. నిజానికి ఇది సెట్స్ కు వెళ్ళడంలోనే కొంత ఆలస్యం జరిగింది. శర్వా సమంతాలు తమ వ్యక్తిగత కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో టైంకు దీన్ని స్టార్ట్ చేయలేకపోయారు.

అటు చూస్తే కన్నడ లో రీమేక్ చేయడం సక్సెస్ కావడం అమెజాన్ లో స్ట్రీమింగ్ అయిపోవడం అన్ని జరిగిపోయాయి. లేట్ అవుతోంది మన దగ్గరే. ఇప్పుడు శర్వా పూర్తిగా కోలుకోవడానికి అక్టోబర్ అవుతుందనుకున్నా నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళొచ్చు ఎలా చూసుకున్న ఈ సంవత్సరం ఇది రిలీజ్ చేయడం కష్టమే. సంక్రాంతికి ప్లాన్ చేయడం కుదరదు.

సో ఫిబ్రవరికో లేదా సమ్మర్ కో షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి శర్వా గాయం దిల్ రాజు ప్లానింగ్ ని తారుమారు చేసేసింది. అయినా సినిమాలదేముంది ఇప్పుడు కాకపోతే రేపు తీసుకోవచ్చు. కాని ఆరోగ్యం విషయంలో అలాంటి రిస్క్ కూడదుగా. అందుకే శర్వా సేఫ్ అవ్వడమే ఇప్పుడు ముఖ్యం