Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ విన్నర్ వెనుక ఉన్నదెవరు?
By: Tupaki Desk | 18 Oct 2017 11:02 AM GMTకొంతమంది నటీనటులు సినిమాలో ఎక్కువగా కనిపించకున్నా సినీ ఇండస్ట్రీలో చాలా గుర్తింపు తెచ్చుకుంటారు. సినిమా ఇండస్ట్రీలో అదృష్టం టాలెంట్ తో పాటు పరిచయాలు కూడా బావుంటేనే కెరీర్ కొంచెం బెటర్ గా ఉంటుంది. మంచి నడవడికతో నలుగురితో బావుంటే కెరీర్ కష్ట కాలంలో ఉన్నపుడు సినిమా ఇండస్ట్రీలో ఎదో ఒక పని దొరుకుతుంది. అంతే కాకుండా మంచి గుర్తింపుతో సినిమా ఛాన్సులు కూడా వస్తాయి.
అయితే టాలీవుడ్ లో ఇప్పుడు అందరు శివ బాలాజీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మనోడు సినిమాల్లో అంత బాగా రాణించకపోయినా కూడా చేసిన కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ మొదటి టైటిల్ ఎప్పుడైతే గెలిచాడో శివ బాలాజీ ఎన్నడు లేని క్రేజ్ ని తెచ్చుకున్నాడు. అయితే అతనికి మీడియాలో అలాగే సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఇచ్చారు. ప్రస్తుతం ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది.
శివ బాలాజీ వెనుక ఒక పెద్ద మీడియా సంస్థ చాలా సపోర్ట్ గా నిలిచిందని అలాగే ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేయడంతో ఆ విధంగా మనోడు ఫేమస్ అయ్యాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ముంబైలలో కూడా శివ బాలాజీ కి కొన్ని మీడియా సంస్థలతో పరిచయాలు ఉన్నాయి అనే విధంగా పలు మీడియాలలో కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం శివ బాలాజీకి మాత్రం మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు.