Begin typing your search above and press return to search.
అసలు శృతిని ఎందుకు తీసుకున్నారంటే..
By: Tupaki Desk | 6 Oct 2016 4:13 PM GMTప్రేమమ్ ఒరిజినల్ మలయాళం వర్షెన్లో ధియేటర్లలు మలార పాత్రకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. డ్యాన్సర్ గా ఉన్న సాయి పల్లవి ఆ సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ఆ పాత్రలో అలా నాచురల్ మొటిమల లుక్ లో ఆమెను చూసిన యూత్ అంతా ఫ్లాటైపోయారు. అయితే 'ఎవరే' సాంగు వీడియో యుట్యూబ్ లో పెట్టినప్పుడు శృతి హాసన్ తెలుగు వర్షన్ లో నప్పలేదని చాలా కామెంట్లు వినిపించాయి. చాలామంది ఆమెను ట్రాల్ చేశారు కూడా. అసలు ఈ యవ్వారంపై తెలుగు ప్రేమమ్ డైరక్టర్ ఏమంటున్నాడో తెలుసా?
''ప్రేమమ్ మలయాళ వర్షన్ లో అందరూ కొత్తాళ్లే చేశారు. నివిన్ పౌళీ కూడా అక్కడ ఒక చిన్న హీరో. కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లింది. కాని ఇక్కడ నాగ చైతన్య పెద్ద హీరో. ఎంతో హైప్ అండ్ ఎక్సపెక్టేషన్ ఉంటుంది. అలాంటప్పుడు మనం కొత్త అమ్మాయిలతో వెళతాం అంటే కుదరదు. అందుకే ఒక స్టార్ హీరోయిన్ కావాలి. అందుకు శృతి హాసన్ అయితే బాగుంటుందని ఆమెను తీసుకున్నాం'' అని చెప్పాడు డైరక్టర్ చందు మొండేటి. అంతేకాదు.. మనోడు ఆ సాంగ్ పై వచ్చిన ట్రాల్స్ అన్నీ చూశాక.. నిర్మాతకు కాల్ చేసి తన భయాన్ని వ్యక్తం చేశాడట. ''నేను ప్రొడ్యూసర్ కు ఫోన్ చేస్తే.. ఆయనేమో ఆ పాట విడుదలయ్యాకనే మన సినిమా బిజినెస్ ఊపందుకుంది. ఎగ్జిబిటర్లకు పాట బాగా నచ్చింది అంటూ చెప్పారు'' అన్నాడు చందు.
ఏదేమైనా కూడా రేపు ధియేటర్లలో శృతి హాసన్ ఒక ఊపు ఊపేస్తుంది అనుకుందాం మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/