Begin typing your search above and press return to search.

సడన్ గా లైమ్ లైట్లోకి ఎందుకొచ్చింది?

By:  Tupaki Desk   |   30 Sep 2016 11:30 AM GMT
సడన్ గా లైమ్ లైట్లోకి ఎందుకొచ్చింది?
X
ఇప్పటికిప్పుడు సింగర్ సునీత చేతిలో అస్సలు సాంగ్ సింగింగ్ ఆఫర్లు అనేవే లేవు. ఎప్పుడో అమావస్యకు ఒక పాట తప్పిస్తే.. అసలు కెరియర్ ఏమాత్రం ఆసక్తిగానే లేదు. కాకపోతే ప్రతీ ఏటా దాదాపు ఆర్నెల్లు ఆమె అమెరికాలో ఆర్కెస్ట్రా టూర్లతో బిజీగా ఉంటుందిలే. ఇదంతా సాగుతున్న వేళ సడన్ గా ఒక వార్తాపత్రికకు ఇంటర్యూ ఇచ్చి సంచలనం లేపింది ఈ సీనియర్ సింగర్.

గత ఆరు సంవత్సరాలుగా తన భర్తకు దూరంగా ఉంటున్నానని.. ఫిలిం ఇండస్ర్టీలో వచ్చే గాసిప్పులు తనని బాధించాయని.. ఇలా చాలా చెప్పింది సునీత. అయితే ఇప్పుడు ఇదే విషయాలపై వీడియో ఇంటర్యూలు కూడా ఇస్తోంది. తన కూతురుకి పెళ్ళి చేయడమే తన లక్ష్యం అంటున్న సునీత.. అసలు ఇప్పుడు సడన్ గా ఇలా ఇంటర్యూలు ఇస్తోందంటే అందుకు ఏదో బలమైన కారణం ఉందంటున్నారు సన్నిహితులు.

నిజానికి ఇప్పటివరకు సంపాదించిన డబ్బుతో.. కొన్ని చిన్న చిన్న సినిమాలు తీయాలని.. అలాగే తన పిల్లలను కూడా ఫిలిం ఇండస్ర్టీలో సెటిల్ చేయాలని సునీత చూస్తున్నాట్లు టాక్. అందుకే ఆమె ఇప్పుడు ఇంటర్యూలు ఇస్తూ ముందుగా తన బ్రాండ్ వాల్యూ కోసం తాపత్రాయపడుతోంది. ఒక్కసారి లైమ్ లైట్లోకి వచ్చేస్తే.. అప్పుడు సినిమా ప్రాజెక్టులు చేయడం ఈజీ అనేదే ఆమె ఫీలింగట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/