Begin typing your search above and press return to search.
‘స్పైడర్’లో దానికి మాత్రం ఫిదానే
By: Tupaki Desk | 29 Sept 2017 7:00 AM IST‘స్పైడర్’ సినిమా మీద విడుదలకు ముందు ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఇలాంటి అంచనాలున్న సినిమాలో ఏ చిన్న విషయం నిరాశ పరిచినా ప్రేక్షకులకు ఏదోలా అనిపిస్తుంది. ఈ చిత్రానికి డివైడ్ టాక్ రావడానికి కూడా అదే కారణం. మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ అనగానే జనాలో చాలా అతిగా ఊహించుకున్నారు. ఆ స్థాయిలో సినిమా లేకపోయేసరికి టాక్ డివైడ్ గా ఉంది. ఐతే ఈ సినిమాలో కొన్ని హై పాయింట్స్ అయితే లేకపోలేదు. కొన్ని ఎపిసోడ్లు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించేలా ఉన్నాయి సినిమాలో.
అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. ఎస్.జె.సూర్య పోషించిన సైకో పాత్ర.. దాని తాలూకు నేపథ్యాన్ని చూపించిన విధానం. మురుగదాస్ ముద్ర స్పష్టంగా కనిపించిన ఎపిసోడ్ ఇది. ఒక పాత్రను ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనేదానికి రుజువుగా నిలుస్తుంది ఈ ఎపిసోడ్. విలన్ అలా సైకోగా మారడానికి చూపించిన కారణాలు.. ఆ నేపథ్యం అవీ చాలా ఇంటెన్స్ గా సాగి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తాయి. ఎస్.జె.సూర్య తెరమీదికి రావడానికి ముందే దాన్ని బిల్డ్ చేసిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. ఇక సూర్య తొలిసారి కనిపించే సీన్ అయితే భలేగా పేలింది. ఆ సీన్లో సూర్య నటన కూడా అదిరిపోవడంతో ప్రేక్షకులకు మంచి కిక్కు వస్తుంది. సినిమాలో హై పాయింట్ అదే. ఈ మధ్య కాలంలో విలన్ పాత్రను ఇలా బిల్డ్ చేసి.. ఇంత ఇంటెన్స్ గా చూపించిన సినిమా లేదనే చెప్పాలి. ఇక్కడ సినిమాకు వచ్చిన ఊపును ద్వితీయార్ధంలో కొనసాగించి ఉంటే ‘స్పైడర్’ స్థాయే వేరుగా ఉండేది.