Begin typing your search above and press return to search.

60ఏళ్ల ఆంటీకి 6కోట్లు కావాలా?

By:  Tupaki Desk   |   17 July 2015 5:23 AM GMT
60ఏళ్ల ఆంటీకి 6కోట్లు కావాలా?
X
ఆశ ఉండాలి. అత్యాశ ఉండకూడదు. దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అలా ఓ సీనియర్‌ నటి ఓ అరుదైన అవకాశాన్నే మిస్సయ్యింది. చరిత్రలో తనకంటూ ఓ పేజీ దక్కే ఛాన్స్‌ చేజార్చుకున్నట్టయ్యింది. అయితే ఈ ఎపిసోడ్‌లో సీనియర్‌ నటి ఎవరు? అనే సందేహం వస్తే.. ఇదిగో ఆవిడే ఈవిడ. తెలుగు ప్రేక్షకులంతా ఎంతో అభిమానంగా అతిలోక సుందరి అని పిలుస్తారు. తెలుగు పరిశ్రమ చీప్‌ అని కొట్టి పారేసిన శ్రీదేవి గురించే ఇదంతా. విషయంలోకి డీప్‌గా వెళితే..

అప్పట్లో బాహుబలి హిందీ వెర్షన్‌ని హృతిక్‌రోషన్‌, జాన్‌ అబ్రహాం, శ్రీదేవి వంటి భారీ కాస్టింగ్‌తో హిందీలో రీమేక్‌ (దృశ్యం తరహాలోనే నటీనటుల మార్పుతో) చేయాలనుకున్నాడు రాజమౌళి. అందుకు సదరు నటీనటుల్ని సంప్రదించాడు. కానీ ఎవరూ ఆసక్తి చూపించలేదు. ముఖ్యంగా శ్రీదేవి అయితే ఏకంగా రూ.6కోట్లు డిమాండ్‌ చేసింది. దిమ్మతిరిగే ఆ డిమాండ్‌ చూశాక.. రాజమౌళి సైలెంటయిపోయారు. వాస్తవానికి శ్రీదేవికి అటు హిందీతో పాటు తెలుగులోనూ రాజమాత శివగామి పాత్రను ఆఫర్‌ చేశారు. కానీ ఎకసెక్కం వల్ల నటించలేదు. భారీ పారితోషికం డిమాండ్‌ చేసి కావాలనే ఛాన్స్‌ వదులుకుంది.

ఆ తర్వాత అదే పాత్రకు రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌ తో సమానంగా రమ్యకృష్ణ ప్రశంసలు అందుకుంటున్నారు. ఓ హిందీ సినిమానే కొట్టే సౌత్‌ సినిమా వచ్చింది. అందులో అతిలోక సుందరి రాజమాతగా నటించారు అన్న పేరు ఎంతో గౌరవాన్ని ఇచ్చేది. కానీ ఆ గౌరవాన్ని అందుకునే అర్హత శ్రీదేవి కోల్పోయింది. అదీ మ్యాటరు.