Begin typing your search above and press return to search.

తంబీల్లో పప్పులుడకలేదేం?

By:  Tupaki Desk   |   17 Aug 2015 8:00 PM GMT
తంబీల్లో పప్పులుడకలేదేం?
X
శ్రీమంతుడు టాలీవుడ్ లో రికార్డులు తిరగరాశాడు. మహేష్ కొరటాల ఫుల్ హ్యాపీస్. అయితే ఇదే సినిమా తమిళ్ లోనే సేమ్ టైమ్ రిలీజైంది. కానీ అక్కడ మన పప్పులేవీ ఉడకలేదు. సెల్వంధన్ వసూళ్లు చూస్తుంటే తంబీలకు అస్సలు ఈ సినిమా కాన్సెప్టు నచ్చలేదనే అనిపిస్తోంది. ఈ సినిమా రిలీజై పది రోజుల్లో కేవలం 60లక్షల షేర్ వసూలు చేసిందంటే ఎంత పూర్ కలెక్షన్సో అర్థం చేసుకోవచ్చు. అయితే లోపం ఎక్కడుంది? మన సబ్జెక్టు అక్కడెందుకు వర్కవుట్ కాలేదు? లెటజ్ సీ.

మనకంటే ఎక్కువగా తమిళ తంబీలే రియలిస్టిక్ సినిమాల్ని ఇష్టపడతారు. శ్రీమంతుడు రియలిస్టిక్ గా నేచురల్ గానే ఉన్నా.. వాళ్లకు కావాల్సిన రా మెటీరియల్ ఇందులో లేదు. అలాగే మాస్ యాక్షన్ స్టయిల్ అసలే కనిపించలేదు. మహేష్ పూర్తి క్లాస్ గా కనిపించాడు. కనీసం విలేజీ లోకి వెళ్లాకైనా ఒంటికి బురద రుద్దుకుని పొలంలోకి దిగి గిల్లికజ్జాలు ఆడలేదు. ద్వితీయార్థంలో గ్రామానికి వెళ్లాక యాక్షన్ పాళ్లు అంతకంతకు పెరుగుతాయనే అనుకుంటే పతాక సన్నివేశాలకు వచ్చే కొద్దీ అదేమీ కనిపించలేదు. సింపుల్ స్టోరీ లో సింపుల్ క్లయిమాక్స్ అసలే నచ్చలేదు. పైగా విశాల్ - అజిత్ - సూర్య - విక్రమ్ లాంటి హీరోలు ఇప్పటికే రామెటీరియలిస్టిక్ యాక్షన్ సినిమాలతో మెప్పిస్తుంటే ఆ స్థాయి మెటీరియల్ ఈ చిత్రంలో కనిపించలేదనే ఫ్లాప్ చేశారని అనుకోవచ్చు.

పోనివ్ ఈ సీజన్ లో తంబీలు తీసిన సినిమాలేమైనా పెద్ద కంటెంట్ తో కుమ్మేసి మనకు దెబ్బేశాయా అంటే అదీ లేదు. వచ్చిందే రెండు సినిమాలు. ఒకటి ఆర్య చేసిన కామెడీ సినిమా.. ఇంకోటి శింబు తీసిన వాలు సినిమా.. రెండూ కూడా అంతంత మాత్రమే.. మన సినిమా కనుక కాస్త క్లిక్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అక్కడ పెద్ద హిట్టయ్యేదే. తదుపరి ప్రాజెక్టుకు బెస్టాఫ్ ఆఫ్ లక్ మహేష్. ఈసారి గట్టిగా కొట్టేద్దాం.