Begin typing your search above and press return to search.
స్టార్ కిడ్ ఫోటోషూట్ వెనక అసలు సీక్రెట్?
By: Tupaki Desk | 2 Aug 2018 6:38 AM GMTఉన్నట్టుండి ఊహించని ఉత్పాతంలా లైమ్ లైట్ లోకొచ్చింది కింగ్ ఖాన్ డాటర్ సుహానా ఖాన్. 18వయసు ఈ సుందరాంగి వస్తూనే తుఫాన్ లా చెలరేగిపోయింది. ప్రఖ్యాత వోగ్ కవర్ పేజీపై సుహానా దిమ్మతిరిగే రూపంతో ప్రత్యక్షమవ్వడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా అవాక్కయి అటే చూసింది. సుహానా ఫోటోషూట్ ప్రస్తుతం వెబ్ మీడియాని ఠారెత్తిస్తోంది. వోగ్ ఫోటో షూట్లో కొన్ని ఫోటోలు ఇప్పటికే రిలీజయ్యాయి. మరికొన్ని హిడెన్ పోటోలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. వీటిలో ఇదిగో ఈ తాజా ఫోటో అంతే వేడెక్కిస్తోంది. పింక్ లో సుహానా దుమ్ము దులిపేసింది.
అసలు ఈ ఫోటోషూట్ వెనక అసలు కథేంటి? అని ఆరాతీస్తే పలు ఆసక్తికర సంగతులే తెలిశాయి. ఈ షూట్ కోసం సుహానా ఒక రోజంతా ఓ ప్రముఖ స్టూడియోలో ఎంతో నిష్ఠగా వెయిట్ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ ఒకటే ఫ్లాష్ ల మధ్య తడిసిముద్దయ్యింది. ఆ సమయంలో డాడ్ షారూక్ - మామ్ గౌరీఖాన్ ఆ పక్కనే దూరంగా కూచుని ఉన్నారు. ప్రఖ్యాత సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ ఎర్రికోస్ ఈ ఫోటోషూట్ ని చేశాడు. అంత పెద్ద స్టార్ కిడ్ ఫోటోషూట్ చేసే అవకాశం తనకే దక్కినందుకు ఎర్రికోస్ ఎంతో హ్యాపీగానూ ఉన్నాడు. ఇక వోగ్ ఇండియా ఫ్యాషన్ డైరెక్టర్ అనైతా ష్రాఫ్ అదజానియా కింగ్ ఖాన్ షారూక్ కి ఫ్యామిలీ ఫ్రెండ్స్. అందుకే సుహానాని ఈ రేంజులో ఆకాశానికెత్తేశారు. అదీ సంగతి.