Begin typing your search above and press return to search.
సునీల్ కమెడియన్ గా ఎందుకు మానేశాడంటే..
By: Tupaki Desk | 18 Feb 2016 1:30 AM GMTసునీల్ ను హీరోగా చూడాలనుకుంటారా.. కమెడియన్ గా చూడాలనుకుంటారా అని ఓ పోల్ పెడితే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సునీల్ కమెడియన్ గా కొనసాగాలని కోరుకునేవారే ఎక్కువమంది. సునీల్ ను హీరోగా చూడ్డం ఇష్టం లేదని కాదు కానీ.. కమెడియన్ సునీల్ అంటే జనాలకు అంతిష్టం మరి. అందుకే హాయిగా కమెడియన్ గా సినిమాలు చేసుకోకుండా ఈ హీరో వేషాల పిచ్చేంటి అని సునీల్ గురించి కామెంట్లు కూడా చేసేస్తుంటారు జనాలు. ఐతే కమెడియన్ గా చేయడంలో ఉన్న కష్టమేంటో మీకేం తెలుసు అంటున్నాడు సునీల్. హీరో పాత్రలకే పరిమితమైపోవడానికి అతను చెబుతున్న కారణమేంటో తెలుసుకుందాం పదండి.
‘‘కమెడియన్ గా వున్నన్నాళ్లు ఇంటి ముఖం తెలియకుండా తిరిగాను. చాలా కష్టపడ్డాను. కమెడియన్ గా 150 కి పైగా సినిమాలు చేశాను. ఇక్కడో పెద్ద ఇబ్బంది గురించి చెప్పాలి. ఇద్దరు పెద్ద హీరోల సినిమాల్లో కమెడియన్ గా చేసేపుడు చాలా కష్టంగా ఉండేది. ముందు ఈ రెండు సినిమా వాళ్లు బాగానే మాట్లాడుకుంటారు. షెడ్యూళ్లు వేసుకుంటారు.తీరా చూస్తే ఇక్కడా పెద్దహీరో వుంటారు.. సీన్ పూర్తవదు.. వదలరు.. అక్కడా పెద్ద హీరో వుంటారు.. సీన్ మొదలవ్వాలి రమ్మంటుంటారు. ఎవర్నీ కాదనలేం. అది ఒక రకమైన తలనొప్పి కాదు’’ అంటూ కమెడియన్ గా పడ్డ ఇబ్బందుల్ని గుర్తు చేసుకున్నాడు సునీల్. కాబట్టి సునీల్ హీరోగా కొనసాగాలనుకోవడం వెనుక కారణమేంటో అర్థమైంది కదా.