Begin typing your search above and press return to search.

కథ వలనే.. నయన వలన కాదు

By:  Tupaki Desk   |   9 Sep 2016 7:30 AM GMT
కథ వలనే.. నయన వలన కాదు
X
ఇప్పుడు చెన్నయ్ లో ఒకటే టాపిక్ తెగ హల్ చల్ చేస్తోంది. అసలు హీరో సూర్య కేవలం విఘ్నేష్‌ శివన్ చెప్పిన కథ వలన అతనికి సినిమా ఇచ్చాడా లేకపోతే అతని ప్రియురాలు నయనతార రికమండ్ చేసింది కాబట్టి సినిమా ఇచ్చాడా అంటూ జనాలు జోకులు పేలుస్తున్నారు. అయితే సూర్య వంటి స్టార్ హీరో కేవలం నయనతార మాట విని సినిమా ఇచ్చేస్తాడా? ఇదే విషయంపై విఘ్నేష్‌ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.

నిజానికి ''నానుం రౌడీ ధాన్'' సినిమా విఘ్నేష్‌ చాలా బాగా తీశాడనే చెప్పాలి. ఆ సినిమాకు నయనతారకు చాలా అవార్డులు వచ్చాయంటే.. చెవిటి అమ్మాయిగా ఆమె క్యారెక్టర్ అద్భుతంగా మలిచాడు దర్శకుడు. అలాగే హీరో విజయ్ సేతుపతి - అతని తల్లి పాత్రలో నటించిన రాధిక క్యారక్టర్లు కూడా సూపరుంటాయి. అందుకే ఆ సినిమా పెద్ద హిట్టయ్యింది. అయితే అటువంటి ప్రాజెక్టు డెలివర్ చేసిన విఘ్నేష్‌ కు సూర్య వంటి హీరో సినిమా ఆఫర్ చేశాడంటే.. ఖచ్చితంగా కథ నచ్చితేనే చేస్తాడు తప్పించి.. ఏదో నయనతార చెప్పిందని ఎలా చేస్తాడులే.

మహా అయితే అమ్మడు తన పవర్ తో ఒక అప్పాయింట్మెంట్ ఇప్పించి ఉండొచ్చు. కాని ప్రాజెక్టు మాత్రం కథబలంతోనే మెటీరియలైజ్ అయ్యుంటుంది అంటున్నారు విఘ్నేష్‌ అభిమానులు. ఏదేమైనా కూడా ఆల్రెడీ నయన్ చాలా పెద్ద స్టార్ హీరోయిన్ కాబట్టి.. విఘ్నేష్‌ చుట్టూ ఇటువంటి రూమర్లు రావడం సహజమేలే.