Begin typing your search above and press return to search.
ఎన్ జీకే ఆలస్యానికి షాకింగ్ కారణం
By: Tupaki Desk | 28 May 2019 6:55 AM GMTసూర్య కథానాయకుడిగా నటిస్తున్న `ఎన్‌జీకే`(నంద గోపాల కృష్ణ) ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సినది. రకరకాల కారణాలతో అంతకంతకు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రిలీజ్ తేదీ ఖాయమైంది. రిలీజ్ వారం రోజుల ముందు తెలుగు మీడియాలో ప్రచార వేగం పెంచారు. నేటి సాయంత్రం సూర్య తెలుగు మీడియాతో ముచ్చటించనున్నారు. అలాగే 7 పీఎం నుంచి జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఎన్ జీకే వాయిదాల ఫర్వం గురించి తెలుగు మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. సూర్య అంత పెద్ద స్టార్ సినిమాకి ఈ సన్నివేశం ఎందుకు వచ్చింది? అంటే.. రకరకాల కారణాలు చెబుతున్నారు. సూర్య కెరీర్ లోనే భారీ స్పాన్ ఉన్న చిత్రమిది. ఎంచుకున్న కథాంశం సహా ప్రతిదీ ఆసక్తి రేకెత్తించేవేనని చెబుతున్నారు. అలాగే చిత్రీకరణ మధ్యలో దర్శకుడి అనారోగ్యం ఇబ్బంది పెట్టింది. ఇదొక్కటే కారణం కాదు.. సూర్యతో సెల్వ రాఘవన్ కి చిన్నపాటి మనస్ఫర్థలు వచ్చాయని .. క్రియేటివ్ డిఫరెన్సెన్ ఓ కారణమని అప్పట్లో ముచ్చట సాగింది. సెల్వ రాఘవన్ ఎంచుకున్న పొలిటికల్ థ్రిల్లర్ కాన్సెప్టు చాలా పెద్ద స్పాన్ ఉన్నది. అందువల్ల బడ్జెట్ల పరంగానూ పెద్ద రేంజు పెట్టాల్సి రావడంతో కొన్ని చిక్కులు తప్పలేదట. ఇదివరకూ టీజర్ రిలీజైనప్పుడు ఇది ధనుష్ నటించిన కల్ట్ క్లాసిక్ `పుదుపేటై` తరహాలో ఉందని తంబీ క్రిటిక్స్ విశ్లేషించారు. అయితే ఇది నేటి పొలిటికల్ ట్రెండ్ కి తగ్గట్టు గా సెల్వ రాఘవన్ కథను తీర్చిదిద్దారని చెప్పుకున్నారు. ఎన్ జీకే చిత్రం సూర్యకు.. అలానే సెల్వకు చాలా ఇంపార్టెంట్. ఆ ఇద్దరికీ ఇటీవల సరైన సక్సెస్ లేదు. అందువల్ల ఎట్టి పరిస్థితిలో బ్లాక్ బస్టర్ కొట్టాలన్న పంతంతో ఏ కోణంలోనూ రాజీకి రాకపోవడంతో నిర్మాతల పైనా ఒత్తిడి నెలకొందట. మరోవైపు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఎస్.ఆర్.ప్రభు వేరే భారీ చిత్రాలు తీస్తుండడం కూడా ఎన్జీకే రిలీజ్ ఆలస్యానికి ఓ కారణం అని చెబుతున్నారు.
ఏదేమైనా లేటుగా వచ్చినా సూర్య లేటెస్టుగా వస్తున్నాడు. అతడి మార్కెట్ తగ్గినా తెలుగులో వీరాభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. దాదాపు 110 కోట్ల మేర వరల్డ్ వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు రైట్స్ ని కెకె రాధామోహన్ 9 కోట్ల మేర వెచ్చించి చేజిక్కించుకున్నారని తెలుస్తోంది. 31న తెలుగు- తమిళంలో ఎన్‌జీకే ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతోంది. సూర్య ఈ సినిమాతో కంబ్యాక్ అవుతారా? అంటూ ఆసక్తికర ముచ్చటా సాగుతోంది.