Begin typing your search above and press return to search.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎందుకు చనిపోయాడో..?

By:  Tupaki Desk   |   14 Jun 2020 10:40 AM GMT
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎందుకు చనిపోయాడో..?
X
ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్' చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం యావత్ సినీ అభిమానులను షాక్ కి గురి చేసింది. 34 ఏళ్ళ సుశాంత్ ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఫ్యాన్ కి ఉరి వేసుకొని బలవన్మరణం చెందాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య న్యూస్ విన్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కి గురైంది. సుశాంత్ సింగ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియనప్పటికీ ఐదు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న తన మాజీ మేనేజర్ మరణానికి ఏమైనా లింక్ ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జూన్ 9న ఒకప్పుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి మేనేజరుగా వ్యవహరించిన దిశా సలియాన్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్‌ లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దిశా ముంబైలోని మలాడ్‌లో తాను నివాసం ఉండే అపార్ట్ మెంట్స్ 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్‌ కు మేనేజర్‌ గా పని చేసిన దిశా ప్రస్తుతం వరుణ్ శర్మ దగ్గర మేనేజర్‌ గా పని చేస్తుంది. ఆమె సూసైడ్ చేసుకున్న 5 రోజులకు సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో సుశాంత్ అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు..? మాజీ మేనేజర్ మరణానికి ఇతని సూసైడ్ కి ఏమైనా లింక్ ఉందా అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

అయితే గత కొంతకాలంగా ఫ్యామిలీకి దూరంగా ఒంటరిగా ఉంటున్న సుశాంత్ సింగ్ డిప్రెషన్ కి చికిత్స తీసుకుంటున్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పలు ఆధారాలు సుశాంత్ ఇంట్లో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.