Begin typing your search above and press return to search.
అడ్వాన్సులే తమ్మూని ఐటెం చేశాయా!!
By: Tupaki Desk | 11 Nov 2015 7:30 AM GMTతానొకటి తలిస్తే అని తెలుగులో ఓ సామెత ఉంది. అలా మెయిన్ హీరోయిన్ రోల్ అని మొదలుపెట్టి.. చివరకు ఐటెం భామగా చిందేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అది కూడా రెండుమార్లు కావడం.. రెండు సందర్భాల్లోనూ హీరో ఒకరే కావడం ఆశ్చర్యకరమైన విషయం. ఇంతకీ ఇదంతా మిల్కీ బ్యూటీ తమన్నా గురించే.
తమన్నా తొలిసారిగా ఐటెం భామగా కనిపించిన సినిమా బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ నటించిన అల్లుడు శీను. హీరోయిన్ పాత్రకు సైన్ చేసి.. తర్వాత సమంత సీన్ లోకి ఎంటర్ అవడంతో., తమ్మూతో ప్రొడ్యూసర్ ఓ ఒప్పందం చేసుకున్నాడు. ఇచ్చిన అడ్వాన్స్ కి బదులుగా ఓ ఐటెంసాంగ్ చేయమంటే.. రెండో ఆలోచన లేకుండా సై అంది తమన్నా. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా.. బోయపాటి శీను డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ మొదలైంది. మళ్లీ తమన్నాను హీరోయిన్ గా బుక్ చేసుకుని.. అడ్వాన్స్ కట్టేశారు. ఈ ప్రాజెక్ట్ అటకెక్కేయడంతో.. భీమినేని డైరెక్షన్ మరో సినిమా మొదలుపెట్టేశాడు బెల్లంకొండ. మళ్లీ పాత ఒప్పందం లాగానే.. అడ్వాన్స్ కి బదులుగా తమ్మూ ఐటెం సాంగ్ కి అగ్రిమెంట్ ఓకే అయింది.
ఇలా రెండుసార్లు తీసుకున్న అడ్వాన్సులే తమన్నాని ఐటెం గాళ్ గా మార్చేశాయి. అంతే తప్ప.. ఐటెం సాంగ్ కోసం కోటికి పైగా పుచ్చుకుందన్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఎందుకంటే తమ్మూ రెమ్యూనరేషన్ ఇప్పుడు 80 లక్షలు. అడ్వాన్స్ గా ఓ పాతిక వరకూ పుచ్చుకుంటోంది మరి.