Begin typing your search above and press return to search.
డైరెక్టర్ సడెన్ స్టార్ అవ్వడం వెనక ఇదీ కథ
By: Tupaki Desk | 27 Oct 2019 1:30 AM GMTవిజయ్ దేవరకొండ- తరుణ్ భాస్కర్ స్నేహితుల బృందం `పెళ్లి చూపులు` చిత్రంతో లైమ్ లైట్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. హీరోగా విజయ్ కి.. దర్శకుడిగా తరుణ్ కి ఆ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. తొలి ప్రయత్నమే జాతీయ అవార్డ్ సినిమాని తీశాడు తరుణ్ భాస్కర్. అటుపై విజయ్ దేవరకొండ స్టార్ గా ఎదిగిన వైనం తెలిసిందే. ఇక తరుణ్ భాస్కర్ కు బాగానే అవకాశాలొచ్చాయి. దర్శకుడిగా మరింత భవిష్యత్ ఉందని విమర్శకులు సైతం అభిప్రాయ పడ్డారు. కానీ విజయ్ ని హీరోగా నిలబెట్టిన కృతజ్ఞతకుగాను... ఇప్పుడు తరుణ్ భాస్కర్ ని హీరోని చేసే బాధ్యతను విజయ్ నెత్తిన వేసుకున్నట్లు ఓ ప్రచారం ఉంది. అందుకే విజయ్ నిర్మాతగా మారి స్నేహితుడితో `మీకు మాత్రమే చెప్తా` అనే ఓ సినిమా నిర్మిస్తున్నాడని కథనాలొచ్చాయి.
ఈసినిమా వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ రూమర్లు వెనుక అసలు నిజాలేంటో తరుణ్ మీడియాతో పంచుకున్నాడు. అలాగే మీడియాలో ఉన్న అపోహలకు.. పాత్రికేయుల సందేహాలను తీర్చాడు. దర్శకుడిగా ఎదుగుతోన్న క్రమంలో హీరోగా అవతారం ఎత్తారు? ఇది మీ దర్శకత్వ భవిష్యత్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది కదా? అని ప్రశ్నించగా... ``నాపై నాకు క్లారిటీ ఉంది. నా ఏకాగక్రత అంతా దర్శకత్వం పైనే. కానీ ఈ సినిమా అనుకోకుండా చేయాల్సి వచ్చింది. హీరోగా ఎంట్రీ ఇస్తానని ఎప్పుడూ అనుకోలేదు`` అని అన్నారు తరుణ్.
ఈ కథను ముందుగా విజయ్ దేవరకొండకి మా దర్శకుడు చెప్పాడు. కానీ రౌడీ ఇమేజ్ కు ఈ కథ సరిపోదు. అందుకే నేను నటిస్తున్నా. ఈ పాత్రకు గ్లామర్ గా కనిపించాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ లైఫ్ లో ఎలా ఉంటామో? అలా ఉంటే సరిపోతుందని దర్శకుడు చెప్పడంతో ఒకే చెప్పా. నా గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. నేను అలాంటివాటిని వెరీ లైట్ తీసుకుంటాను అని తెలిపాడు. ఇది మిడిల్ క్లాస్ సాప్ట్ వేర్ ఎంప్లాయ్ కథ. నాకు సూటైనదేనని అన్నాడు. నాకు పెద్దగా బాధ్యతలు అలాంటివేమి లేవు. సినిమా చేయడం అనుకోకుండా జరిగిందంతే.. అని తనపై వచ్చిన కథనాలకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసాడు.