Begin typing your search above and press return to search.

అక్కడ టాలీవుడ్ సినిమాలే ఎక్కువ

By:  Tupaki Desk   |   30 Oct 2016 5:30 PM GMT
అక్కడ టాలీవుడ్ సినిమాలే ఎక్కువ
X
ఇప్పుడు ఓవర్సీస్ కలెక్షన్స్ ఏ సినిమాకైనా చాలా ముఖ్యం అయిపోయాయి. లోకల్ గా ఓ ఏరియాకి వచ్చినంత వసూళ్లు అక్కడ నుంచే వస్తుండడంతో ఎవరూ యూఎస్ మార్కెట్ ని వదులుకునేందుకు సిద్ధంగా ఉండడం లేదు. కొన్ని చిన్న సినిమాలకైతే.. అసలు బడ్జెట్ కి మించి యూఎస్ కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ఏరియాలో హిందీ సినిమాల కంటే తెలుగు సినిమాలకు కలెక్షన్స్ ఎక్కువగా వస్తుండండం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

రీసెంట్ గా విడుదలైన యే దిల్ హై ముష్కిల్ కు.. యూఎస్ లో తొలిరోజున 6లక్షల డాలర్లు వచ్చాయి. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ సల్మాన్ మూవీ సుల్తాన్ అయితే 5లక్షల డాలర్లను రాబట్టింది. కానీ టాలీవుడ్ హీరోలయిన మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్ లతో పాటు.. దర్శకులు రాజమౌళి.. త్రివిక్రమ్ ల సినిమాలు.. ప్రీమియర్లతో కలిపి తొలి రోజునే మిలియన్ డాలర్లను కూడా రాబట్టేస్తుంటాయి. విపరీతమైన క్రేజ్ ఉన్న బాలీవుడ్ సినిమాలకు రెట్టింపు స్థాయిలో వసూళ్లు రాబట్టడంలో ఓ సీక్రెట్ ఉంది.

హిందీ సినిమాలతో పోల్చితే.. యూఎస్ లో మన సినిమాలకు మూడు రెట్లు టికెట్ రేట్ వసూలు చేస్తుంటారు. అందుకే హిందీ సినిమాల వసూళ్లు తక్కువగా ఉంటే.. తక్కువ థియేటర్లలో ఇచ్చినా మన సినిమాలకు మాత్రం భారీ వసూళ్లు వస్తుంటాయి. యూఎస్ మార్కెట్ ని మనోళ్లు కాప్చర్ చేసేసి.. వసూళ్లు పిండేసుకోవడంలో రహస్యం ఇదే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/