Begin typing your search above and press return to search.

#నాని24 కోసం ఆ రేంజ్ ప్రిపరేషన్ జరుగుతోందట

By:  Tupaki Desk   |   17 Feb 2019 6:52 AM GMT
#నాని24 కోసం ఆ రేంజ్ ప్రిపరేషన్ జరుగుతోందట
X
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న 'జెర్సీ' చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుండడంతో నాని నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెడుతున్నాడు. 'జెర్సీ' తర్వాత నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కాకుండా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు.

నాని-విక్రమ్ సినిమా విషయానికి వస్తే ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో నాని పాత్ర దాదాపు నాలుగు దశలలో ఉంటుందని.. టీనేజ్ బాయ్ దగ్గరనుండి మొదలు పెట్టి.. యువకుడిగా.. మధ్య వయస్కుడిగా.. యాభై ఏళ్ళ వయసున్న వ్యక్తిగా కనిపిస్తాడని టాక్ ఉంది. నాని ఈ సినిమాలో లీడ్ రోల్ కాబట్టి ప్రోస్థటిక్ మేకప్ తో వివిధ దశలకు సంబంధించిన గెటప్పులు సహజంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారట. మరి నాని స్నేహితుల పాత్రలు.. ఇతర క్యారెక్టర్లు కూడా ఆయా దశలలో కనిపించాల్సి ఉంటుంది కదా? వారు సంగతేంటి? వారికోసమే ఇప్పుడు సెలెక్షన్స్ జోరుగా సాగుతున్నాయట.

ఒక్కో పాత్ర కోసం డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉన్న ముగ్గురు నలుగురు నటులు అవసరం అవుతారు. పైగా ఒక్కో పాత్రకు సంబంధించిన వ్యక్తుల ఫీచర్స్ దగ్గరగా ఉండాలి కాబట్టి ఈ సెలెక్షన్ ప్రాసెస్ ముందు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుంటోందట. అందుకే #నాని24 అధికారిక ప్రకటన రావడం మరింతగా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.